Indian Army Operation: జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు ఉగ్రవాదులు హతం
Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్లో జవాన్లు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఎన్కౌంటర్లో ఒకే చోట ఐదుగురు ఉగ్రవాదులు.. మరొకచోట ఇంకో ఉగ్రవాది హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి ఆర్మీ జవాన్లు ఈ ఆపరేషన్ చేపట్టారు.
Jammu Kashmir Encounter: పాకిస్థాన్ సపోర్ట్‌తో పనిచేస్తున్న ఉగ్రవాద మూకలను మట్టుబెట్టేందుకు భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు శుక్రవారం సంయుక్తంగా భారీ ఆపరేషన్ చేపట్టారు. కుల్గామ్‌లో ఐదుగురు ఉగ్రవాదులు, రాజౌరిలో ఒకరిని అంతమొందించారు. రాజౌరి జిల్లాలోని బెహ్రోట్, బుధాల్‌లో ఆర్మీ జవాన్లు, రాజౌరీ పోలీసులు, పారామిలిటరీ బలగాల మధ్య సమన్వయంతో ఉగ్రవాదులను ఏరివేస్తున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా.. బలగాలు కూంబింగ్ చేపట్టగా.. ఓ ఇంటి వద్ద దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆర్మీ జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. అక్కడ ఒకటి AK 47, 3 మ్యాగజైన్‌లు, 3 గ్రెనేడ్‌లు, ఒక పర్సుతో సహా ఇతర ఆయుధాల నిల్వను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
కుల్గామ్‌లోని నెహమా గ్రామంలో ప్రత్యేక కార్డన్-అండ్-సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా.. లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులతో దాదాపు 18 గంటల తీవ్ర కాల్పులు జరిగాయి. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఆపరేషన్ చేపట్టిన బలగాలు.. అనుమానిత ప్రాంతం చుట్టుముట్టారు. దక్షిణ కాశ్మీర్ డీఐజీ రయీస్ మాట్లాడుతూ.. ఇళ్లలో దాక్కున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలిపారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించామన్నారు. ఈ ఆపరేషన్ ఒక పెద్ద విజయం అని అన్నారు.
మరణించిన ఉగ్రవాదులను సమీర్ అహ్మద్ షేక్ (PAFF), యాసిర్ బిలాల్ భట్, డానిష్ అహ్మద్ థోకర్, హంజుల్లా యాకూబ్ షా, ఉబైద్ అహ్మద్ పద్దర్‌గా గుర్తించారు. హతమైన ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించడంలో డ్రోన్ ఫుటేజీ సాయపడింది. కుల్గామ్‌లోని నెహమాలోని సామ్నో వద్ద మళ్లీ కాల్పులు జరగ్గా.. కొందరు ఉగ్రవాదులు దాక్కున్న ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఉగ్రవాదులు తమ రహస్య స్థావరం నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో సమీర్ అహ్మద్ షేక్ అనే ఉగ్రవాది 2021లో మిలిటెంట్ ర్యాంకుల్లో చేరగా.. మరికొందరు గతేడాది లేదా ఈ ఏడాదిలో చేరినట్లు తెలుస్తోంది.
Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే
Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి