India vs China: స్పందించిన ఇండియన్ ఆర్మీ
Indian Army | న్యూ ఢిల్లీ: చైనా బలగాలతో తూర్పు లడాఖ్‌లోని గల్వన్ లోయలో సోమవారం రాత్రి జరిగిన హోరాహోరీపై భారత ఆర్మీ స్పందించింది. చైనాతో ఘర్షణపై మంగళవారం సాయంత్రం ఇండియన్ ఆర్మీ స్పందిస్తూ.. `దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడటానికి భారత సైన్యం ఎల్లవేళలా కృషి చేస్తుంది, ఎంతటి పోరాటమైనా చేస్తుంది` అని స్పష్టంచేసింది.
Indian Army | న్యూ ఢిల్లీ: చైనా బలగాలతో ( Chinese troops ) తూర్పు లడాఖ్‌లోని గల్వన్ లోయలో సోమవారం రాత్రి జరిగిన హోరాహోరీపై భారత ఆర్మీ ( Indian Army ) స్పందించింది. చైనాతో ఘర్షణపై మంగళవారం సాయంత్రం ఇండియన్ ఆర్మీ స్పందిస్తూ.. "దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడటానికి భారత సైన్యం ఎల్లవేళలా కృషి చేస్తుంది, ఎంతటి పోరాటమైనా చేస్తుంది" అని స్పష్టంచేసింది. చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. చైనా సైనికుల దాడిలో తీవ్రంగా గాయపడిన 17 మంది సైనికులపై అక్కడి అత్యల్ప ఉష్ణోగ్రతల వాతావరణం కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించిందని.. ఫలితంగా ఆ 17 మంది సైనికులను కూడా కోల్పోవాల్సి వచ్చిందని ఆర్మీ వెల్లడించింది. మొత్తంగా ఈ ఘటనలో 20 మంది సైనికులు ( Indian soldiers ) ప్రాణాలు కోల్పోయారు. ( India vs China: చైనా బలగాల కాల్పుల్లో 20 మంది భారత సైనికుల వీర మరణం )
ఇదిలావుంటే, తూర్పు లడఖ్‌లోని సరిహద్దు ప్రాంతంలో ఉన్న పరిస్థితి గురించి ప్రస్తుతం సైన్యం, దౌత్యపరమైన మార్గాల ద్వారా చైనాతో చర్చిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..