India vs China: చైనా బలగాలతో ఘర్షణలో 20 మంది భారత సైనికుల వీర మరణం

Colonel Santosh Babu | న్యూ ఢిల్లీ: చైనా సైన్యం మరోసారి రెచ్చిపోయింది. స్నేహహస్తం చాచినట్టు నటిస్తూనే భారత సైనికులను దొంగ దెబ్బ కొట్టింది. తూర్పు లద్దాక్‌లోని గల్వన్ లోయలో భారత బలగాలపై దాడికి తెగబడిన చైనా.. 20 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకుంది. చైనా బలగాలతో ( Chinese troops ) జరిగిన హోరాహోరి పోరాటంలో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

Last Updated : Jun 17, 2020, 01:55 AM IST
India vs China: చైనా బలగాలతో ఘర్షణలో 20 మంది భారత సైనికుల వీర మరణం

Colonel Santosh Babu | న్యూ ఢిల్లీ: చైనా సైన్యం మరోసారి రెచ్చిపోయింది. స్నేహహస్తం చాచినట్టు నటిస్తూనే భారత సైనికులను దొంగ దెబ్బ కొట్టింది. తూర్పు లద్దాక్‌లోని గల్వన్ లోయలో భారత బలగాలపై దాడికి తెగబడిన చైనా.. 20 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకుంది. చైనా బలగాలతో ( Chinese troops ) జరిగిన హోరాహోరి పోరాటంలో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందినట్టు అధికార వర్గాలు తెలిపాయి.. అయితే, చైనా వైపు సైతం అంతే ప్రాణ నష్టం జరిగి ఉంటుందని.. కాకపోతే ఆ సంఖ్యను కచ్చితంగా చెప్పలేమని సదరు అధికార వర్గాలు పేర్కొన్నాయి. చైనా బలగాలతో ఘర్షణలో తెలుగు బిడ్డ వీర మరణం )

లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్‌ ఒప్పందాన్ని ( Line of actual control consensus) పక్కకుపెట్టి చైనా హద్దుమీరి ప్రవర్తించిందని భారత విదేశాంగ శాఖ మండిపడింది. సరిహద్దుల నిర్వహణ విషయంలో భారత్ ఎప్పుడూ వాస్తవాధీన రేఖ ( లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ) దాటి వెళ్లలేదని.. చైనా కూడా అలాగే వ్యవహరించాలని కోరుకుంటున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ అన్నారు. 1975 తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి జరిగిన ఘర్షణల్లో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News