Territorial Army Officer posts: ఇండియన్ ఆర్మీలో పోస్టుల భర్తీ, అర్హతలు, Salary, సెలెక్షన్ ప్రాసెస్
Indian Army Recruitment 2021, Territorial Army Officer notification : Indian Army Recruitment 2021 ముఖ్యమైన తేదీలు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : జులై 20, 2021 ఆన్‌లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ : ఆగస్టు 19, 2021 ఎగ్జామ్ డేట్ : సెప్టెంబర్ 26, 2021
Indian Army Recruitment 2021, Territorial Army Officer notification : ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు ఇది ఒక మంచి అవకాశం. ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీ విభాగం కింద అధికారుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్స్ భర్తీ కోసం చేపడుతున్న ఈ రిక్రూట్‌మెంట్‌కి దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తి కలిగిన, అర్హత ఉన్న అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ jointerritorialarmy.gov.in ను సందర్శించవచ్చు.
ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2021 కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వారు ఆగస్టు 19, 2021 లోగా అప్లై చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఈ వెబ్‌సైట్‌లో ఉంటుంది.
Indian Army Recruitment 2021 ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : జులై 20, 2021
ఆన్‌లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ : ఆగస్టు 19, 2021
ఎగ్జామ్ డేట్ : సెప్టెంబర్ 26, 2021
Indian Army Recruitment 2021 posts - ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2021 లో భర్తీ చేసే పోస్టుల వివరాలు :
టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్
Also read : Govt jobs: CRPFలో పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. అర్హతలు, ఎంపిక విధానం
Territorial Army Officer posts eligibility - టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్టులకు అవసరమైన అర్హత ప్రమాణాలు:
అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
Territorial Army Officer age limit - ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం అవసరమైన వయోపరిమితి
అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2021 దరఖాస్తు ఫీజు
అభ్యర్థులు రూ. 200/- అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Territorial Army Officer Salary - టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్స్ వేతనాలు :
లెఫ్టినెంట్- లెవెల్ 10- 56,100- 1,77,500
కెప్టెన్- లెవెల్ 10A- 61,300- 1,93,900
మేజర్- లెవెల్ 11- 69,400- 2,07,200
లెఫ్టినెంట్ కల్నల్- లెవెల్- 12A- 1,21,200- 2,12,400
కల్నల్- లెవెల్ 13- 1,30,600 - 2,15,900
బ్రిగేడియర్- లెవెల్ 13A- 1,39,600 - 2,17,600
Also read : 7th Pay Commission: బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. DA hike తో పెరగనున్న శాలరీ
Selection Process for Territorial Army Officer - టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ ఎంపిక ప్రక్రియ:
షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను సంబంధిత టెరిటోరియల్ ఆర్మీ గ్రూప్ హెడ్‌క్వార్టర్స్ ప్రిలిమినరీ ఇంటర్వ్యూ బోర్డ్ (PIB) స్క్రీనింగ్ చేస్తుంది. ఈ స్క్రీనింగ్ టెస్టులో భాగంగా ఇంటర్వ్యూ, రాత పరీక్ష నిర్వహిస్తారు. సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (SSB), మెడికల్ బోర్డ్ నిర్వహించే పరీక్షల ఆధారంగా తుది ఎంపిక పూర్తవుతుంది.
Also read : NEET 2021: నీట్ 2021 దరఖాస్తు: నీట్ పరీక్ష తేదీ, సమయం, ప్యాటర్న్ వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook