Join Indian Army: ఇండియన్ ఆర్మీలో భారీగా పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద ఖాళీలను భర్తీ చేస్తోంది. మీకు ఇండియన్ ఆర్మీలో చేరాలనే ఆసక్తి ఉంటే.. ఇదో గొప్ప అవకాశం. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా.. ఖాళీగా ఉన్న పోస్టులలో ఎన్‌సీసీ క్యాడెట్లను నియమించనున్నారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ 15 ఫిబ్రవరి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద మొత్తం 55 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఎన్‌సీసీ పురుష అభ్యర్థులకు 50 ఖాళీలు, మహిళా అభ్యర్థులకు 5 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 1, 2023 నాటికి 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. 


ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/కళాశాల నుంచి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. ఇందులో అన్ని సంవత్సరాల మార్కులను పరిగణనలోకి తీసుకుటే.. కనీసం 50 శాతం మార్కులు సాధించాలి.


గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే డిగ్రీ మొదటి, రెండు, మూడవ లేదా నాల్గవ సంవత్సరంలో కనీసం 50 శాతం మొత్తం గ్రేడ్ పాయింట్ సగటును పొంది ఉండాలి. అదేవిధంగా అభ్యర్థులు ఎన్‌సీసీ సీనియర్ డివిజన్/వింగ్‌లో కనీసం రెండు లేదా మూడు సంవత్సరాలు తమ సర్వీస్‌ను అందించి ఉండాలి. 
 
ఇలా దరఖాస్తు చేసుకోండి.
 
==> ముందుగా ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.inకి వెళ్లండి 
==> ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి.. దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. 
==> అవసరమైన అన్ని సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయండి.
==> దీని తర్వాత అప్లికేషన్‌ను సబ్మిట్ చేయండి. 
==> భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్‌ను ప్రింట్ తీసుకోండి


Also Read: Jayamangala Venkataramana: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ బంపర్ ఆఫర్.. టీడీపీకి షాక్..!  


Also Read: Pm Kisan Scheme 2023: కోట్లాది మంది రైతులకు గుడ్‌న్యూస్.. హోలీకి కేంద్రప్రభుత్వం గిఫ్ట్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook