Indian Bank launches video KYC facility enabled by VCIP technology: ఇప్పుడు ఇండియన్ బ్యాంకు ఖాతా తెరవాలంటే చాలా సులవు. ఎందుకంటే ఇండియన్ బ్యాంకులో ఖాతా తెరవాలనుకునే వారికి వీడియో కేవైసీ సదుపాయం కల్పిస్తున్నట్లు  ఆ బ్యాంకు (Indian Bank) తెలిపింది. వీడియో బేస్డ్‌ కస్టమర్‌ ఐడెంటిఫికేషన్‌ ప్రాసెస్‌ (వీసీఐపీ) (Video-Based Customer Identification Process (VCIP) technology) టెక్నాలజీ ద్వారా దీన్ని చేపట్టనున్నట్లు పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో ఖాతాదారులు అకౌంట్ ఓపెన్ చెయ్యడానికిబ్యాంకు (Bank) బ్యాంచ్ కు రావాల్సిన అవసరం ఉండదని తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏటీఎం కార్డు, (ATM card) చెక్‌ బుక్‌ సంబంధిత చిరునామాకు వస్తాయని వెల్లడించింది. 


Also Read : India Vs Pakistan: టీ20ల్లో ఆల్‌ టైమ్‌ రికార్డు సృష్టించిన దాయాదుల పోరు


అకౌంట్ (Account) ప్రారంభం సందర్భంగా జమ చేయాల్సిన కనీస మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పంపొచ్చని తెలిపింది. ఇలా ముందస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత నిరంతర మొబైల్‌ బ్యాంకింగ్‌ సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. రానున్న రోజుల్లో దశలవారీగా ఈ సదుపాయాన్ని ఇతర సేవలకు కూడా విస్తరిస్తామని తెలిపింది.


Also Read : Hyderabad Metro : హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌


వీడియో కేవైసీ (Video KYC) ద్వారా ఖాతా తెరవాలనుకునేవారు మొబైల్‌ నంబర్‌ (Mobile‌ number‌) ఈ-మెయిల్‌ ఐడీ, పాన్‌ కార్డు (PAN card), ఆధార్‌ కార్డు దగ్గర ఉంచుకొని కెమెరా, మైక్రోఫోన్‌ సదుపాయం ఉన్న కంప్యూటర్‌ ద్వారా బ్యాంకును (Bank) సంప్రదించాలని తెలిపింది. యూఐడీఏఐ, ఓటీపీల ఆధారంగా ఖాతాదారుడి వివరాలను ధ్రువీకరిస్తామని ఇండియన్ బ్యాంకు (Indian Bank) పేర్కొంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook