Indian Variant: ఇండియన్ వేరియంట్ అనే పదాన్ని తొలగించాల్సిందే : కేంద్ర ప్రభుత్వం
Indian Variant: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఇంకా కొనసాగుతోంది. కరోనా మహమ్మారి నియంత్రణకై ప్రతీ రాష్ట్రం లాక్‌డౌన్ పాటిస్తోంది. ఈ క్రమంలో ఇండియన్ వేరియంట్ అనే పదం చర్చనీయాంశమవుతోంది. ఇదే అంశంపై కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆంక్షలు విదించింది.
Indian Variant: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఇంకా కొనసాగుతోంది. కరోనా మహమ్మారి నియంత్రణకై ప్రతీ రాష్ట్రం లాక్‌డౌన్ పాటిస్తోంది. ఈ క్రమంలో ఇండియన్ వేరియంట్ అనే పదం చర్చనీయాంశమవుతోంది. ఇదే అంశంపై కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆంక్షలు విదించింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) విజృంభణతో B.1.617 రకం వైరస్ ప్రాచుర్యంలో వచ్చింది. చాలామంది ఈ వేరియంట్‌ను ఇండియన్ వేరియంట్‌గా పిలుస్తున్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆంక్షలు చర్చనీయాంశమవుతున్నాయి. కరోనా వైరస్‌కు సంబంధించిన అంశాల్లో ఇండియన్ వేరియంట్ అనే పదాన్ని సామాజిక మాధ్యమాల్నించి తొలగించాలని కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేస్తూ లేఖ రాసింది. ఈ వేరియంట్‌ను ఇండియన్ వేరియంట్ అని ప్రస్తావించడం అసత్యాన్ని వ్యాప్తి చేయడమేనని తెలిపింది. దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదముందని స్పష్టం చేసింది. ఇటువంటివి వ్యాప్తి చేస్తే నోటీసులు పంపాలని కేంద్ర ప్రభుత్వం (Central government)రాయిటర్స్ సంస్థకు సూచించింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియంట్లను వైద్యులు, ఆరోగ్య నిపుణులు గుర్తిస్తుంటారు. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో గుర్తించిన కరోనా వేరియంట్స్‌గా స్పష్టం చేసింది. చాలా వరకూ మీడియా సంస్థలు B.1.617ను ఇండియన్ వేరియంట్ అంటూ కథనాల్ని ప్రచురించి..ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇండియన్ వేరియంట్ (Indian Variant) అనే పదాన్ని ఉపయోగించిన సమాచారాన్ని తొలగించడం చాలా కష్టమని కొందరు నిపుణులు అంటున్నారు. ఈ చర్య కీవర్డ్ ఆధారిత సెన్సార్‌షిప్‌కు దారి తీస్తుంది.
Also read: Oxygen Tankers: థాయ్‌లాండ్ నుంచి ఇండియాకు 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook