కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) కారణంగా ఇంట్లోంచి కాలు బయటపెట్టాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది. ఎంతో తప్పనిసరి అయితే కానీ ఎవ్వరూ ఇంట్లోంచి బయటకు రాకూడదు అని ప్రభుత్వాలు కూడా కఠినంగా చెబుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫీసుకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్లకు మాత్రం బయట పరిస్థితి ఎలా ఉన్నా.. వెళ్లక తప్పడం లేదు. కానీ ఐటి వాళ్లకు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ ( Work from home ) వీలు ఉండటంతో ఇంట్లోంచే పని చేసుకునే అవకాశం ఉంది. ఐటి ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం పలు నిబంధనలను ( VPN norms ) సడలించింది. అలా తొలుత మార్చి నెలలో లాక్‌డౌన్ ( Lockdown ) విధించినప్పటి నుంచి ఏప్రిల్ 30 వరకు నిబంధనలు సడలిస్తున్నట్టు పేర్కొన్న కేంద్రం.. ఆ తర్వాత ఏప్రిల్ 30 నుంచి జూలై 31 వరకు ఆ సడలింపులు అమలులో ఉంటాయని పేర్కొంది. జూలై 31 తర్వాత పరిస్థితి ఏంటా అని ఆందోళన చెందుతున్న ఐటి నిపుణులకు తాజాగా కేంద్రం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. ( Also read: Power Star Trailer: వర్మ ‘పవర్ స్టార్’ ట్రైలర్ వచ్చేసింది )


వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధలన సడలింపులను డిసెంబర్ 31 వరకు కొనసాగిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఐటి రంగంలో పనిచేస్తున్న ( IT professionals ) వారికి భారీ ఊరట లభించింది. ఇంట్లోంచి బయటకు వెళ్లకుండానే డిసెంబర్ 31 వరకు ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం లభించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా ఐటి కంపెనీలు ఈ ఏడాది చివరి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీకి వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. (Also read: అమెజాన్ ఉద్యోగులకు శుభవార్త )