అమెజాన్ ఉద్యోగులకు శుభవార్త

Amazon Work From Home for Employees |  కరోనా సాధారణ పరిస్థితి నెలకొనేవరకు తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే  పనిచేయాలని సూచించినట్లు ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon)  తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ సంస్థలో 8.4 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Last Updated : Jul 16, 2020, 01:55 PM IST
అమెజాన్ ఉద్యోగులకు శుభవార్త

కరోనా సమయంలో కొన్ని కంపెనీలు మూతపడ్డాయి. మరికొన్ని కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేందుకు అవకాశం కల్పించాయి. ముఖ్యంగా మల్టీ నేషనల్ కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తున్నాయి. కరోనా సాధారణ పరిస్థితి నెలకొనేవరకు తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే  పనిచేయాలని సూచించినట్లు ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon)  తెలిపింది. కచ్చితంగా చెప్పాలంటే వచ్చే ఏడాది జనవరి 8వరకైతే తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అవకాశం కల్పించినట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి: ఆరోగ్యమంత్రి 

సీఎన్‌బీసీ రిపోర్టు ప్రకారం.. జనవరి 8 వరకు అమెజాన్ తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని (Amazon Work From Home for Employees) సూచించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరిన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని అమెజాన్ పొడిగించింది. కరోనా వైరస్ కేసులు నమోదువుతున్న తొలి రోజుల్లో అక్టోబర్ 2 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించారు.  కార్మికుడి కరోనా బిల్లు రూ.1.52 కోట్లు.. ఆపై ట్విస్ట్

ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ సంస్థలో 8.4 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది మొత్తం ఇంటి నుంచి పనిచేసేందుకు ఉద్యోగులకు అవకాశం కల్పించినట్లు అమెజాన్ అధికార ప్రతినిధి సీఎన్‌బీసీకి తెలిపారు. యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్ లాంటి దిగ్గజ సంస్థలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. ఈ ఏడాది చివరివరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినట్లు మాత్రం నిర్ధారించలేదు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News