నిఘా వర్గాల హెచ్చరికలతో.. భారత నావికాదళం అప్రమత్తం !!
తీర ప్రాంతాల్లో దాడులకు తెగబడే అవకాశముందని నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు రావడంతో భారత నావికాదళం అప్రమత్తమైంది
సముద్ర తీరం వెంబడి భారత భూభాగంలోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశముందని నిఘావర్గాల హెచ్చరికలతో మన నావికాదళ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో నావికా దళం తీర ప్రాంతంలో గస్తీని మరింత పెంచింది. తీర ప్రాంతాల్లోనే కాక సముద్ర జలాల్లో పహారా బాగా పెంచినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రముఖ మీడియా కథనం ప్రచురించింది.
జాతీయ మీడియా కథనం ప్రకారం శత్రువల నుంచి ఎలాంటి ప్రతిఘటనకైనా నేవి ఫోర్స్ సిద్ధమైనట్లు తెలిసింది. శత్రువుల నౌనలను గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసింది. రాడార్ల సాంకేతికత ద్వారా సముద్రంలో అనుమానాస్పద నౌకల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని కీలక ప్రాంతాల్లో నౌకాదళాన్ని మోహరింపజేశామని నేవీ అధికారి ఒకరు తెలిపారు.
ఇదిలా ఉంటే మరో వైపు శత్రువా? మిత్రుడా? అనేది భారత నేవీ సులువుగా తెలుసుకొనేలా ఇరవై మీటర్ల కన్నా ఎత్తున్న మత్స్యకారుల పడవలన్నింటికీ ఓ ట్రాకింగ్ వ్యవస్థను బిగించాలని తాము ప్రభుత్వాన్ని కోరినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు.
కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత పాక్ దూకుడు వ్యవరిస్తోంది. అంతకలహాలను సృష్టించేందుకు శతావిధాలుగా ప్రయత్నిస్తోంది. కశ్మీర్ ప్రజల బాగు కోసం తాము ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు తిరుగుబాటు దారులకు మద్దతిస్తామని పరోక్ష సంకేతాలు దిఇస్తోంది. ఇలాంటి తరుణంలో తీర ప్రాంతాలను టార్గెట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో నేవి ఫోర్స్ ఈ మేరకు అలర్ట్ అయింది