Indian Navy: ఇండియన్ నేవీ మరింతగా బలోపేతమైంది. అత్యాధునిక శక్తివంతమైన రెండు ఛాపర్లు భారతీయ నేవీ అమ్ములపొదికి చేరాయి. మరో 22 ఛాపర్లు త్వరలో రానున్నాయి. అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా అత్యాధునిక హెలీకాప్టర్లు వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ నేవీ(Indian Navy) మరింతగా బలోపేతం చేసే క్రమంలో అమెరికా నుంచి ఎంహెచ్ 60 ఆర్ మల్టీ రోల్ (MH60R Multi role Helicopters)అత్యాధునికమైన 24 హెలీకాప్టర్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందమైంది. తొలిదశలో భాగంగా ఇప్పటికే రెండు హెలీకాప్టర్లు చేరాయి. ఈ ఒప్పందం ద్వారా అమెరికా, ఇండియాల మధ్య రక్షణ వ్యవహారాల్లో సహకారం, భాగస్వామ్యం మరింతగా బలపడటమే కాకుండా కొత్త శకానికి నాంది పలికినట్టవుతుందని ఇండియా, అమెరికాలు వెల్లడించాయి. విదేశీ సైనిక ఒప్పందంలో భాగంగా లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ ఈ హెలీకాప్టర్లను ఉత్పత్తి చేస్తోంది. భారత ప్రభుత్వం దాదాపు 2.4 బిలియన్ల డాలర్లు పెట్టి ఎంహెచ్-60 ఆర్ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు తిరుచిరాపల్లి ఆర్డినెన్స్ పరిశ్రమ తయారు చేసిన అత్యాధునిక 12.7 ఎంఎం మిషన్ గన్‌లలో భారత నౌకాదళానికి 15, సైనిక దళాలకు 10 అందజేసింది. ఇజ్రాయిల్ (Izrael) సాంకేతికతతో 25 మెషిన్ గన్లను తయారు చేసింది. మిషన్ గన్లను రిమోట్ సహాయంతో ఉపయోగించేలా అభివృద్ది చేశారు. 


Also read: Karnataka: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుకు రంగం సిద్ధం, మోదీతో సమావేశమైన యడ్యూరప్ప


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook