Indian Navy Jobs: ప్రతిష్ఠాత్మక ఇండియన్ నేవీలో అప్రెంటిస్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. నావెల్ డాక్ యార్డ్‌లో పనిచేసేందుకు అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. ఆ వివరాలు పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఇండియన్ నేవీ ముంబయ్ నేవల్ డాక్‌యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ముంబై నేవల్ డాక్‌యార్డ్‌లో మొత్తం 338 అప్రెంటిస్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. పదవ తరగతి లేదా ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్ధులతో ఈ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీలు, జీతం, ఎంపిక విధానం ఎలా ఇప్పుడు చూద్దాం..


అప్రెంటిస్ పోస్టుల వివరాలు


ముంబై నేవల్ డాక్‌యార్డులో మొత్తం 338 అప్రెంటిస్ పోష్టులు భర్తీ కానున్నాయి. ఇందులో ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రోప్లేటర్. మెరైన్ ఇంజనీర్ ఫిట్టర్. ఫౌండ్రీ మ్యాన్ ప్యాటర్న్ మేకర్, మెకానిక్ డీజిల్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ మెషీన్ టూల్ మెయింటెనెన్స్, పెయింటర్, షీట్‌మెటర్ వర్కర్, పైప్ ఫిట్టర్, మెకానిక్ రెఫ్ అండ్ ఏసీ, టైలర్ ఉద్యోగాలున్నాయి. అర్హులైన అభ్యర్ధులకు ఆగస్టు 1, 2001 నుంచి అక్టోబర్ 31 , 2008 మధ్య పుట్టి ఉండాలి. ఐటీఐ అభ్యర్ధులకు నెలకు 7 వేలరూపాయలు, ఐటీఐ లేనివారికి నెలకు 6 వేలు స్టైపెండ్ చెల్లిస్తారు. 


ఇండియన్ నేవీలో భాగమైన డాక్‌యార్డ్‌లో పోస్టుల భర్తీ కోసం పదవ తరగతిలో 50 శాతం మార్కులతోపాటు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత ఉండాలి. పోస్టుని బట్టి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ జూలై 11,2022 గా ఉంది. 


Also read: Agniveer Notification 2022: అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవిగో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook