భారతదేశంలో త్వరలోనే అన్ని రైళ్లో సీసీటీవీల ఏర్పాటుతో పాటు వైఫై కనెక్టింగ్ సదుపాయాలు కూడా కల్పిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. యూపీ రాజధాని లక్నోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఇండియన్ రైల్వేస్టేషన్లలో ఇక నుండి సెక్యూరిటీని కూడా చాలా పటిష్టం చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.


అలాగే సిబ్బంది ప్రయాణికులకు పరిశుభ్రమైన ఆహాయం ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని కూడా అన్నారు. అంతర్జాతీయ స్థాయిలోనే అతిపెద్ద కర్మాగారంగా రాయ్‌బరేలి రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని తాము యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. యూపీఏ ప్రభుత్వం.. యూపీలో రైల్వేని పట్టించుకోకపోవడం శోచనీమన్నారు. భారతదేశంలోని ఎక్కువమంది పనిచేస్తున్న రైల్వే శాఖలో మరింతమందికి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని..అందుకే 90వేల మందిని రిక్రూట్ చేసుకొనేందుకు నోటిఫికేషన్లు కూడా మంజూరు చేస్తామని పీయూష్ గోయల్ తెలిపారు.