Platform Ticket Rules: ప్లాట్‌ఫామ్ టిక్కెట్‌తో రైలులో ప్రయాణం చేయవచ్చా లేదా
Platform Ticket Rules: ఇండియన్ రైల్వేలో మనకు తెలియని చాలా నియమ నిబంధనలుంటాయి. సాధారణంగా ఎవరినైనా పిక్ చేసుకునేందుకు లేదా సెండాఫ్ ఇచ్చేందుకు రైల్వే స్టేషన్ వెళ్లినప్పుడు ప్లాట్‌ఫామ్ టికెట్ తప్పనిసరి. ఈ ప్లాట్ ఫామ్ టికెట్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు మీ కోసం.
Platform Ticket Rules: రైల్వే స్టేషన్లో అడుగు పెడితే ప్లాట్‌ఫామ్ టికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే చట్టపరంగా చర్యలు ఉంటాయి. అయితే ఇదే ప్లాట్‌ఫామ్ టికెట్ ఆధారంగా మీరు రైలులో ప్రయాణం చేయడానికి వీలవుతుందా లేదా. అసలు రైల్వే నియమాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
స్నేహితులు, బంధువులను రిసీవ్ చేసుకునేందుకు లేదా సెండాఫ్ ఇచ్చేందుకే రైల్వేస్టేషన్ తరచూ వెళ్తుంటాం. అలాంటప్పుడు ప్లాట్‌ఫామ్ టికెట్ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే చట్టపరంగా చర్యలు ఉంటాయి. అయితే అదే ప్లాట్‌ఫామ్ టిక్కెట్‌తో రైలులో ప్రయాణించేందుకు వీలవుతుందా అంటే కొన్ని సందర్భాల్లో అవుతుందనే చెప్పాలి. రైల్వే నిబంధనల ప్రకారం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్లాట్‌ఫామ్ టిక్కెట్‌తో ప్రయాణించవచ్చు. మీ బంధువులు లేదా స్నేహితులకు సెండాఫ్ ఇచ్చేందుకు వెళ్లినప్పుడు రైళ్లో లగేజ్ సర్దే క్రమంలో ఒక్కోసారి ట్రైన్ కదిలిపోవచ్చు. ఆ పరిస్థితుల్లో మీ వద్ద కేవలం ప్లాట్‌ఫామ్ టికెట్ మాత్రమే ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు అదే రైలులో తదుపరి స్టేషన్ వరకూ ప్రయాణించవచ్చు.
మీరు చేయాల్సిందల్లా తక్షణం రైలులో ఉండే టీటీని సంప్రదించాలి. టీటీని కలిసి తదుపరి స్టేషన్ వరకు టికెట్ తీసుకుని 250 రూపాయలు ఫైన్ చెల్లించాలి. అప్పుడే ఇబ్బంది ఉండదు. అయితే మీరు చెప్పేది నిజమని నమ్మడానికి మీ వద్ద ప్లాట్‌ఫామ్ టికెట్ ఉండాలి. అప్పుడే టీటీకు నమ్మకం కుదురుతుంది.
అదే విధంగా ఆన్ లైన్ వెయిటింగ్ టికెట్ ఉన్నప్పుడు కూడా రైలులో ప్రయాణించేందుకు కుదరదు. వెయిటింగ్ టిక్కెట్‌తో ప్రయాణిస్తూ పట్టుబడితే చట్టపరంగా చర్యలు ఉంటాయి. ఎందుకంటే వెయిటింగ్ ఉంటే ఆటోమేటిక్ గా టికెట్ కేన్సిల్ అయిపోతుంది.
Also read: Cheap and Best Hatchback Car: SUV డిజైన్‌తో బెస్ట్ Hatchback కారు, ధర కూడా చాలా తక్కువ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook