భారతీయ రైల్వే చేపట్టిన భర్తీ ప్రక్రియకు రికార్డుస్థాయి స్పందన లభిస్తోంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్‌బీ) విడుదల చేసిన 62వేలకు పైగా గ్రూప్ డీ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే గడువు మరో అయిడురోజుల్లో ముగియనుంది. కావున దరఖాస్తు చేసుకున్న వారు త్వరపడాలని అధికారులు సూచించారు. ఇప్పటివరకు కోటికిపైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపిన అధికారులు.. మరో అయిదు రోజుల్లో ఈ సంఖ్య రెండు కోట్లకు చేరుకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
 
గ్రూప్‌ సీ, డీలో 90 వేలు; రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో 9500 ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అసిస్టెంట్‌ లోకో పైలట్స్‌, టెక్నీషియన్ల ఉద్యోగాలకు 50 లక్షలకుపైగా దరఖాస్తులు అందినట్లు రైల్వేవర్గాలు తెలిపాయి. 26,502 లోకోపైలట్‌, టెక్నీషియన్ల పోస్టులతో పాటు 62,907 గ్రూప్‌-డి పోస్టుల ఖాళీల భర్తీ చేపట్టిన రైల్వేశాఖ 15 భాషల్లో పరీక్షలు నిర్వహించనుంది.