Trains Cancelled: రైల్వే ప్రయాణం చేసేవారికి అతి ముఖ్యమైన గమనిక. వివిధ కారణాలతో ఇటీవల తరచూ రైళ్లు రద్దవుతున్నాయి. ఈసారి ఏకంగా 300 రైళ్లు రద్దు కానుండటం విశేషం. ఇంకొన్ని రైళ్లుు రూట్ మళ్లించనున్నారు. ఇంతపెద్దఎత్తున రైళ్లు రద్దుకు కారణాలేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో గత కొద్దికాలంగా తరచూ వివిధ కారణాలతో రైళ్లు రద్దవుతుండటంతో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే విజయవాడ పరిధిలో హైదరాబాద్, చెన్నై రైళ్లు రద్దవడంతో సమస్య ఎదురైంది. ఈసారి నార్తర్న్ రైల్వే పరిధిలో ఏకంగా 300 రైళ్లు రద్దు కానున్నాయి. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ దేశ రాజధాని ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచం నలుమూలల్నించి దేశాధినేతలు, ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. పలు మార్గాల్ని నిషేధించింది. ఢిల్లీలో అయితే దుకాణాలు, వ్యాపారాలు, ఇతర సంస్థలు మూసివేయనున్నారు. ప్రయాణీకుల రద్దీ తగ్గించేందుకు ఇప్పుడు తాజాగా రైళ్లు కూడా రద్దు చేశారు. 


సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ మూడ్రోజులపాటు ఉత్తర రైల్వే పరిధిలో ఏకంగా 200 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మరో 100 రైళ్లను మార్గం మళ్లిస్తున్నారు. కొన్ని రైళ్లు రీ షెడ్యూల్ అవుతున్నాయి. మరి కొన్ని రైళ్లు టెర్మినల్ ఛేంజ్ అవుతున్నాయి. ఉత్తర రైల్వే ఈ మేరకు ఏయే రైళ్లు రద్దయ్యాయి, ఏయే రైళ్లు రూట్ మారుతున్నాయనే వివరాలతో జాబితా విడుదల చేసింది. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ ఢిల్లీ ఇతర సమీప ప్రాంతాలకు వెళ్లే ఆలోచన లేదా రిజర్వేషన్ చేయించుకున్నవారు ఈ జాబితా చెక్ చేసుకోవాలి.



మరోవైపు గురుగ్రామ్‌లోని మల్టీ నేషనల్ కంపెనీలకు సెప్టెంబర్ 8 నుంచి 11 వరకూ ట్రాఫిక్ ఆంక్షల కారణంగా వర్క్ ఫ్రం హోం మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే కాకుండా స్థానికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ చర్యలు తీసుకోనున్నారు. 


జీ20 శిఖరాగ్ర సమావేశం నేపధ్యంలో సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 11 వరకూ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. మెట్రో, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలకు ఎలాంటి అంతరాయం ఉండదు. నేషనల్ హైవే నెంబర్ 48 కాకుండా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి వెలుపల సాధారణం ట్రాఫిక్‌పై ఏ విధమైన ఆంక్షలు లేవు.


Also read: Chandrayaan 3 Updates: జాబిల్లిపై నిశీధి, స్లీప్ మోడ్‌లో ప్రజ్ఞాన్ రోవర్, సెప్టెంబర్ 22న నిద్ర లేస్తుందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook