Indian Railways: దేశంలోని తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఎక్కడ, ఎలా ఉంటుందో తెలుసా
Indian Railways: దేశంలో రైల్వే ప్రైవేట్ దిశగా అడుగులేస్తోంది. కొన్ని రైల్వే లైన్లను ప్రైవేటీకరణ చేయడంతో పాటు రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దేశంలోనే తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఎక్కడుంది, ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Indian Railways: దేశంలో ఇటీవలి కొద్దికాలంగా రైల్వేలో వినూత్న పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, వందేభారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్ల ప్రారంభం వంటివి ప్రధానమైనవి. మరోవైపు రైల్వే ప్రైవేటీకరణ కూడా దశలవారీగా ప్రారంభమైపోయింది. రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ ఇందులో భాగమే.
ఇండియన్ రైల్వేస్ మన కళ్ల ముందే అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. దేశవ్యాప్తంగా వందలాది రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. ఓ వైపు బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన దశలో ఉండగా మరోవైపు వందేభారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రారంభమయ్యాయి. రైళ్లలో సౌకర్యాల కల్పన మెరుగైంది. అదే సమయంలో రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరణ చేయడం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ క్రమంలో దేశంలో తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్ సిద్ధమైపోయిందని..చూసేందుకు 5 స్టార్ హోటల్‌లా ఉంటుందని చాలామందికి తెలియదు. ఆ రైల్వే స్టేషన్ ఎక్కడుంది, ఎలాంటి వసతులున్నాయనేది తెలుసుకుందాం..
దేశంలోనే తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఇది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఉన్న రాణి కమలాపతి రైల్వే స్టేషన్ ఇది. చూడ్డానికి 5 స్టార్‌లా కన్పిస్తుంది. ఎందుకంటే సౌకర్యాలు కూడా 5 స్టార్ సౌకర్యాలే ఉంటాయి ప్రయాణీకులకు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఈ రైల్వే స్టేషన్ సొంతం. ఇండయిన్ రైల్వేస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రకారం ఈ రైల్వే స్టేషన్‌ను ప్రైవేట్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. 2021లో హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ పేరును రాణి కమలాపతి రైల్వేస్టేషన్‌గా మార్చారు. ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి బాధ్యత బన్సల్ గ్రూప్‌కు దక్కింది. ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణంతో పాటు 8 ఏళ్ల పాటు నిర్వహణ కూడా బన్సల్ గ్రూప్ చేస్తుంది. 45 ఏళ్లకు ఈ రైల్వే స్టేషన్ లీజుకిచ్చినట్టు తెలుస్తోంది.
దేశంలోనే తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్‌లో సౌకర్యాలు
రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్‌లో ఉండే సౌకర్యాలన్నీ లభిస్తాయి. ఫ్లైట్ ఆలస్యమైనప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో ఏ విధంగా షాపింగ్ చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా షాపింగ్ స్టోర్స్, రెస్టారెంట్స్, కేటరింగ్ షాపులు అన్నీ ఉంటాయి. మహిళా ప్రయాణీకుల సౌకర్యార్ధం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్‌లో విద్యుత్ సరఫరా కోసం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటయ్యాయి. దీంతో లభించే విద్యుత్‌తో స్టేషన్ పనులు సాఫీగా జరిగిపోతాయి. ఈ రైల్వే స్టేషన్‌ను..ఏదైనా ఎమర్జన్సీ తలెత్తినప్పుడు ప్రయాణీకుల్ని స్టేషన్ నుంచి 4 నిమిషాల్లోనే బయటకు తీసుకొచ్చేవిధంగా తీర్చిదిద్దారు.
తొలిదశలో ప్రైవేటీకరణ చేసిన రైల్వే స్టేషన్ ఇది. ఇది విజయవంతమైతే నెమ్మదిగా దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లను ఇదే తరహాలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Also read: BSF Recruitment 2023: బీఎస్ఎఫ్‌లో ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ, కళ్లు తిరిగే ఆకర్షణీయమైన జీతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook