BSF Recruitment 2023: బీఎస్ఎఫ్ లో ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ.. రూ. 44,900 నుంచి రూ. 1,42,400 వరకు నెల జీతం

BSF Recruitment 2023 Notification: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకై ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. కేంద్ర పదాతి దళాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల నియామకాలు జరగనున్నాయి. జీతభత్యాలు భారీగా ఉండటంతో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 20, 2023, 08:37 AM IST
BSF Recruitment 2023: బీఎస్ఎఫ్ లో ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ.. రూ.  44,900 నుంచి రూ. 1,42,400 వరకు నెల జీతం

BSF Recruitment 2023 Notification: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్.. కేంద్ర పదాతిదళాల్లో అత్యంత కీలకమైంది. బీఎస్ఎఫ్ దళాలంటే అనుక్షణం దేశ సరిహద్దు రక్షణలో అప్రమత్తంగా ఉండేవాళ్లు. బీఎస్ఎఫ్‌లో ఆకర్షణీయమైన జీతంతో ఉద్యోగం కావాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఖాళీలు పెద్దగా లేకపోవడంతో పోటీ ఎక్కువే ఉంటుంది. 

BSF Recruitment ప్రకారం ఇన్‌స్పెక్టర్ పదవుల భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలకు దరఖాస్తు చేయాలంటే పూర్తిగా ఆన్‌లైన్ విధానం అందుబాటులో ఉంది. మహిళలు, పురుషుల కోసం బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వెబ్‌సైట్‌లో అధికారిక నోటిఫికేషన్‌లో మరిన్ని వివరాలున్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా కళాశాల నుంచి లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్‌లో డిగ్రీ ఉండాలి. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హుడైన అభ్యర్ధికి వయస్సు 30 ఏళ్లలోపుండాలి. ప్రవేశ పరక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. బీఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్ 2023 ప్రకారం వేకెన్సీ కేవలం 2 మాత్రమే ఉన్నాయి. 

బీఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్ 2023 అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఎంపికైన అభ్యర్ధుల జీతం చూస్తే మతిపోవల్సిందే. ఆకర్షణీయమైన జీతం ఉంటుంది. 44,900 రూపాయల నుంచి 1,42,400 రూపాయల వరకూ నెల జీతం ఉంటుంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్ధులు బీఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము 247 రూపాయలు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ కేటగరీ అభ్యర్ధులకు, మహిళా అభ్యర్ధులకు ప్రవేశ రుసుము ఉండదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు జూన్ 12 నుంచి ప్రారంభమయ్యాయి. రెండే రెండు పోస్టులు ఖాళీ ఉండటంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. 

Also Read: Best Cars: 5 లక్షల కంటే తక్కువ ధర కలిగిన టాప్ మైలేజ్ కార్లు ఇవే

బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ ( లైబ్రేరియన్ ) పోస్టులు కేవలం రెండే ఖాళీలున్నాయి. బీఎస్ఎప్ రిక్రూట్‌మెంట్ 2023 ప్రకారం గరిష్ట వయస్సు 30 సంవత్సరాల లోపుండాలి. బీఎస్ఎఫ్ 2023 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా కళాశాళ నుంచి లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ ఇన్ ఫర్మేషన్‌లో డిగ్రీ పొంది ఉండాలి. 

ఇక కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా పబ్లిక్ రంగ సంస్థలో సంబంధిత పోస్టులో రెండేళ్ల అనుభవం ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం లేదా సంస్థ నుంచి లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ ఇన్‌ఫర్మేషన్‌లో మాస్టర్ డిగ్రీ ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్‌లో డిప్లొమా ఉండాలి. 

బీఎస్ఎఫ్‌లో ఇన్‌స్పెక్టర్ ( లైబ్రేరియన్ ) పోస్టుల ఎంపిక ప్రవేశ పరీక్ష ద్వారా జరుగుతుంది. ఎంపిక ప్రక్రియ గురించి పూర్తి వివరాలు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్ధులకు తరువాత సూచిస్తారు. ఎంపిక ప్రక్రియ గురించి మరిన్ని వివరాలు పొందాలంటే బీఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌ను ఆశ్రయించాలి.

Also Read: Hyundai Venue: హ్యుండయ్ వెన్యూ కొత్త వేరియంట్ లాంచ్, ఈ మూడు ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News