రాజధాని ఎక్స్‌ప్రెస్, గతిమన్ ఎక్స్‌ప్రెస్, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ వంటి సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్రయాణించే రైలు ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్. ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని తగ్గించే విధంగా త్వరలోనే సరికొత్త అత్యాధునిక సామర్థ్యం కలిగిన ఏరోడైనమిక్ ఇంజన్లు రైలు పట్టాలెక్కనున్నాయి. భారతీయ రైల్వే చరిత్రలోనే తొలిసారిగా ఓ ఏరోడైనమిక్ రైలు ఇంజిన్‌ని రూపొందించినట్టు భారతీయ రైల్వే తెలిపింది. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ ఈ ఇంజిన్‌ని రూపొందించింది. 


రాజధాని ఎక్స్‌ప్రెస్, గతిమన్ ఎక్స్‌ప్రెస్, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ వంటి సూపర్ ఫాస్ట్ రైళ్ల రాకపోకలకు ఈ తరహా రైలు ఇంజిన్లను ఉపయోగించనున్నట్టు భారతీయ రైల్వే వెల్లడించింది. గంటకు సుమారు 200 కి.మీ వేగంతో ప్రయాణించే శక్తిసామర్థ్యాలు ఈ ఏరోడైనమిక్ ఇంజన్ సొంతం అని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.