IRCTC Tour Package: ఉత్తరాఖండ్‌ను సందర్శించేందుకు ఆగస్టు సరైన నెల. ఉత్తరాఖండ్ అంటేనే ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. అందుకే దేవభూమిగా పిలుస్తుంటారు. ఒకే టూర్ ప్యాకేజ్‌లో అన్ని ప్రముఖ క్షేత్రాల్ని సందర్శించేలా ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజ్ అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజ్ ఎప్పుడు ప్రారంభం కానుంది, ఎంత ఖర్చవుతుందనే వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్సీటీసీ దేశంలోని నలుమూలల వివిధ రకాల టూర్ ప్యాకేజ్‌లు నిర్వహిస్తోంది. వీటిలో ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శన ఉంది. ఇప్పుడు త్వరలో ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ ప్రాంతాల సందర్భనకు ఐఆర్సీటీసీ లాంచ్ చేసిన టూర్ ప్యాకేజ్ ప్రారంభం కానుంది. ఈ టూర్ ప్యాకేజ్‌లో భాగంగా పర్యాటకులు భీమ్‌తాల్, అల్మోరా, కోసాని, రాణికేత్ వంటి ప్రాంతాల్ని భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా తిరిగి రావచ్చు. 


ఈ మేరకు ఐఆర్సీటీసీ ట్వీట్ కూడా చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రబాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజ్ ప్రారంభం కానుంది. ఇటీవల ఇండియన్ రైల్వేస్ కొత్తగా ప్రారంభించిన భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్‌లో ఈ యాత్ర ఉంటుంది. ఈ ఏడాది ఆగస్చు 8వ తేదీన ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఫుడ్, డ్రింక్స్ గురించి ఆందోళన అవసరం లేదు. టీ, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా ఐఆర్సీటీసీ ప్లాన్‌లోనే ఉంటుంది. ఈ ప్లాన్‌లో అల్మోరా, బైద్యనాథ్, భీమ్‌తాల్, కౌసాని, నైనితాల్, రాణికేత్  ప్రాంతాలు దర్శించవచ్చు. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 10 రాత్రులు, 11 రోజులుంటుంది. ఒక్కొక్కరికి 28,020 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీరు కూడా ఈ యాత్ర చేయాలనుకుంటే ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చు లేదా 9281495843 నెంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. 


ఈ ప్యాకేజ్ పేరు దేవభూమి ఉత్తరాఖండ్ యాత్ర. భారత్ గౌరవ్ మానస్కంద్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఉంటుంది. సికింద్రాబాద్, కాజీపేట్, బల్లార్‌షా, నాగపూర్, ఇటార్సి, భోపాల్ స్టేషన్లలో బోర్డింగ్ ఉంటుంది. 


Also read: CBSE Board Exam: సీబీఎస్ఈలో ఇక రెండు బోర్డు పరీక్షలు, కేంద్రం ఆమోదం, ఎప్పుడెప్పడంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook