Discount on Train Tickets: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్స్‌పై 25 % వరకు డిస్కౌంట్ ఆఫర్స్..
Indian Railways Reduces Train Ticket Prices: రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏసీ చైర్ కార్ రైళ్లతో ఎగ్జిక్యూటీవ్ క్లాస్ ఉన్న ఏసీ రైళ్లు, వందేభారత్ రైలు టికెట్స్‌పై చార్జీలను 25 శాతం వరకు తగ్గిస్తూ ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటన చేసింది. బేస్ ఫేర్‌పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని ఇండియన్ రైల్వేస్ స్పష్టంచేసింది.
Indian Railways Reduces Train Ticket Prices: రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏసీ చైర్ కార్ రైళ్లతో ఎగ్జిక్యూటీవ్ క్లాస్ ఉన్న ఏసీ రైళ్లు, వందేభారత్ రైలు టికెట్స్‌పై చార్జీలను 25 శాతం వరకు తగ్గిస్తూ ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటన చేసింది. బేస్ ఫేర్‌పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని ఇండియన్ రైల్వేస్ స్పష్టంచేసింది. బేస్ ఫేర్ కాకుండా రిజర్వేషన్ చార్జీలు, సూపర్ ఫాస్ట్ సర్ చార్జ్, జీఎస్టీ వంటి అదనపు చార్జీలు యథాతథంగా ఉంటాయని రైల్వే శాఖ తేల్చిచెప్పింది. సీటింగ్ ఆక్యుపెన్సీ, బెర్త్ ఆక్యుపెన్సీ ఆధారంగానే టికెట్ ధరల తగ్గింపు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని రైల్వే శాఖ వెల్లడించింది.
గడిచిన 30 రోజుల్లో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లను గుర్తించి, ఆయా రైళ్లలో ఎంత మేరకు డిస్కౌంట్ ఆఫర్‌ని ప్రవేశపెట్టాలి అనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని ఇండియన్ రైల్వేస్ పేర్కొంది. అందులోనూ ఆ రైలు ప్రయాణించే మార్గంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటుందో.. ఆ మార్గంలోనే డిస్కౌంట్ ఆఫర్స్‌ని వర్తింపజేస్తున్నట్టు రైల్వే శాఖ వివరించింది.
ఏయే మార్గాల్లో, ఏయే రైళ్లలో, చార్జిలపై ఎంత మేరకు తగ్గింపు ఇవ్వాలి అనేది ఆయా జోన్ల ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛాధికారాల్ని వారికే బదిలీ చేసింది.
ఈ డిస్కౌంట్ తక్షణమే అమలులోకి వర్తిస్తుంది అని స్పష్టంచేసిన ఇండియన్ రైల్వేస్.. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి ఈ తగ్గింపు వర్తించదు అని తేల్చిచెప్పింది. రాబోయే ఆరు నెలల కాలం పాటు ఈ తగ్గింపు అమలులో ఉంటుందన్న రైల్వే శాఖ.. అందులోనూ డిమాండ్‌ని బట్టి వారం రోజుల పాటు డిస్కౌంట్ ఇవ్వాలా, లేక వారాంతాల్లో డిస్కౌంట్ ఇవ్వాలా లేదంటే సీజనల్ జర్నీలకు డిస్కౌంట్ ఇవ్వాలా అనే నిర్ణయం తీసుకునే అధికారం జోనల్ ఇంచార్జులకు ఉంటుంది.
ఇది కూడా చదవండి : Flipkart Personal Loans: ఫ్లిప్‌కార్ట్ నుంచి ఇకపై వ్యక్తిగత రుణాలు, కేవలం 30 సెకన్లలోనే
తరచుగా సమీక్షలు చేపట్టి, డిస్కౌంట్ అనంతరం రైలు ప్రయాణికుల నుంచి స్పందన ఎలా ఉంది, ఆక్యుపెన్సీ ఎలా ఉంది అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని డిస్కౌంట్ ఆఫర్‌ని కొనసాగించడమా లేక నిలిపేయడమా అనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని రైల్వే శాఖ తమ తాజా ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి : Hyundai SUV Sales: హ్యుండయ్ కంపెనీ క్రెటానే కాదు వెన్యూ కూడా టాప్ సెల్లర్, ధర ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK