Shatabdi And Duronto Special Trains: సామాన్యుడి వాహనం రైలు బండి అని ప్రభుత్వాలకు సైతం తెలుసు. అందుకే భారతీయ రైల్వే శాఖ 4 శతాబ్ది రైలు సర్వీసులు, ఒక దురంతో ప్రత్యేక రైలు సర్వీసును ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఈ కొత్త రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ మేరకు ఓ ట్వీట్ ద్వారా సర్వీసుల వివరాలు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సరికొత్తగా నాలుగు శతాబ్ది స్పెషల్, ఒక దురంతో ప్రత్యేక రైలు సర్వీసును భారతీయ రైల్వే ప్రారంభించనుందని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 15వ తేదీ మధ్యలో ఈ రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తాయని తన పోస్టులో పేర్కొన్నారు. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఈ రైలు సర్వీసుల ద్వారా ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. అయితే ఆ అయిదు రైలు సర్వీసులు ఏయే మార్గాలలో అందుబాటులోకి రానున్నాయో సైతం వివరించారు.


Also Read: AP Parishad Elections: ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్


శతాబ్ది రైలు సర్వీసుల షెడ్యూల్
- న్యూఢిల్లీ    -     అమృత్‌సర్ (ప్రతిరోజూ)
-  న్యూఢిల్లీ    -     అమృత్‌సర్ (వారానికి ఒక రైలు)
- చండీగఢ్    -     న్యూఢిల్లీ (వారంలో 6 రోజులు)
- న్యూఢిల్లీ    -    దౌరాయ్ (ప్రతిరోజూ)
దురంతో ప్రత్యేక రైలు షెడ్యూల్
- సారాయ్ రోహిల్లా, ఢిల్లీ    -    జమ్మూ తావి (వారంలో 3 రోజులు)



Also Read: Sunrisers Hyderabad Full Squad: సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం ఆటగాళ్లు, వారి ప్రదర్శన వివరాలు


దేశంలో భారీ సంఖ్యలో కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ రైల్వే పరివార్ విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు. రైల్వేమెన్ విశ్రాంతి సైతం తీసుకోకుండా తమ సేవలు అందిస్తున్నారని, భారత ఆర్థిక వ్యవస్థలో తమవంతు పాత్ర పోషిస్తున్నారని కితాబిచ్చారు. 4,621 శ్రామిక్ ప్రత్యేక రైలు సర్వీసులు మొత్తం 63 లక్షలకు పైగా ప్రజలను వారి కుటుంబానికి చేరువ చేశాయని, లాక్‌డౌన్ తరువాత కిసాన్ ప్రత్యేక రైలు సర్వీసులు సైతం ప్రారంభించిన విషయాన్ని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గుర్తు చేశారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook