దేశంలో మరో బుల్లెట్ ట్రైన్ కారిడార్ ( Bullet Train Corridor ) పై సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రతిష్ఠాత్మక ముంబై- పూణే-హైదరాబాద్ ( Mumbai-pune-hyderabad ) బుల్లెట్ ట్రైన్ కోసం డీపీఆర్ ( DPR ) పై చర్చలు ప్రారంభమయ్యాయి.  అన్నీ సానుకాలమైతే వచ్చే యేడాది చివరికి పనులు ప్రారంభం కావచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశ ఆర్ధిక రాజధాని ముంబై నుంచి దేశపు రెండో రాజధాని కావల్సిన హైదరాబాద్ వరకూ బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు రంగం సిద్ధమవుతోంది. ముంబై నుంచి పూణే మీదుగా హైదరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ కారిడార్ నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక అంటే డీపీఆర్ పై చర్చించేందుకు నవంబర్ 5న ప్రీ బిడ్ సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశంలో 711 కిలోమీటర్ల హైస్పీడ్ రైల్ కారిడార్ పై సర్వేతో పాటు ఉపరితలం, అండర్ గ్రౌండ్ సదుపాయాలు,  సబ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా వంటి అంశాలపై చర్చించనున్నారు. ముంబై పూణే హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ టెండర్లను నవంబర్ 18న ఓపెన్ చేయనున్నారు. 


ఇది కాకుండా మరో 7 రూట్లలో బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్ల ( 7 Bullet train corridors ) ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం గుర్తించింది. ముంబై - పుణే - హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ - లక్నో - వారణాసి, ముంబై - నాసిక్ ‌- నాగపూర్‌, ఢిల్లీ - జబల్పూర్ ‌- అహ్మదాబాద్‌, చెన్నై - మైసూర్‌, ఢిల్లీ - చండీగఢ్ ‌- అమృత్‌సర్‌, వారణాసి - పాట్నా-హౌరా రూట్లలో బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌లను అభివృద్ధి చేయనున్నారు. దేశంలోని ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లపై సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)లను తయారు చేసే బాధ్యతను ఇప్పటికే  నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌)కు అప్పగించింది ఇండియన్ రైల్వేస్ ( Indian Railways ) . 


బుల్లెట్ ట్రైన కారిడార్లు ప్రారంభమైతే...ప్రతిపాదిత నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుంది. వ్యాపార, వాణిజ్యం మరింతగా పెరిగే అవకాశముంది. Also read: Bihar Assembly Election 2020: బిహార్‌లో ప్రారంభమైన తొలి దశ పోలింగ్‌.. హేమాహేమీలు వీరే