ఇవాళ కొత్త రికార్డును నమోదుచేసిన రూపాయి
ఇవాళ డాలర్ తో పోల్చుకుంటే రూపాయి మరింత బలహీనపడింది.
ఇవాళ డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మరింత బలహీనపడింది. సోమవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి 45 పైసలు క్షీణించి 72.18 వద్ద ముగిసింది.
ఇవాళ ఉదయం ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో స్థానిక కరెన్సీ (రూపాయి) రికార్డుస్థాయిలో 72.15 వద్ద ప్రారంభమైంది. గత ముగింపులో ఇది 71.73గా నమోదయింది. తాజాగా 45 పైసలు పడిపోయి 72.18 వద్ద కొనసాగుతోంది. సెప్టెంబరు 6న డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.11నమోదైంది.
అమెరికన్ కరెన్సీ కోసం డిమాండ్, దిగుమతిదారుల కొనుగోలు, ముడి చమురు ధరలు, మూలధన ప్రవాహాల పెరుగుదల దృష్ట్యా రూపాయి విలువ బలహీనపడిందని విదేశీ డీలర్లు చెప్పారు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ భారీ జోక్యం తరువాత.. శుక్రవారం రూపాయి 26 పైసలు పెరిగి 71.73 వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలలో కొనసాగుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభంలో 85.01 పాయింట్లు, లేదా 0.22 శాతం నష్టపోయి 38,304.81వద్ద.. నిఫ్టీ 11,545.40 వద్ద కొనసాగుతోంది.