Covid-19 updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ కొన్నిరోజుల నుంచి కరోనా కేసులు, మరణాలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. నిన్నఒక్కరోజే లక్షకు చేరువలో కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో బుధవారం ( సెప్టెంబరు 9న ) దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్తగా.. 95,735 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 1,172 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,65,864కి పెరగగా.. మరణాల సంఖ్య 75,062కి చేరినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.  Also read: Ram Gopal Varma: కరోనా సోకిన భారత్‌కు.. కంగనా సోకిన శివసేనకు వ్యాక్సిన్ లేదు


ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,19,018 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 34,71,784 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. బుధవారం దేశవ్యాప్తంగా 11,29,756 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 9 వరకు మొత్తం 5,29,34,433 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.  EPFO ఖాతాదారులకు శుభవార్త.. వడ్డీ రేటు ఫిక్స్