EPFO ఖాతాదారులకు శుభవార్త.. వడ్డీ రేటు ఫిక్స్

ఉద్యోగులందరికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఆరు కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. 

Last Updated : Sep 9, 2020, 07:02 PM IST
EPFO ఖాతాదారులకు శుభవార్త.. వడ్డీ రేటు ఫిక్స్

EPFO to pay 8.5% interest on EPF: న్యూఢిల్లీ: ఉద్యోగులందరికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఆరు కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్‌ (EPF) పై 8.5 శాతం వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. అయితే.. దీనిని రెండు దఫాలుగా ఉద్యోగుల ఖాతాల్లో క్రెడిట్ చేయాలని నిర్ణయించింది. ఈపీఎఫ్ ఖాతాల్లోని ఫండ్‌పై 8.15 శాతం వడ్డీని ప్రస్తుతం జమ చేస్తారు. మిగిలిన 0.35 శాతం వడ్డీని ఈ ఏడాది డిసెంబరులో జమ చేస్తారు. దీనికి సంబంధించి బుధవారం జరిగిన ఈపీఎఫ్ఓ ట్రస్టీల సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. Also read: EPFO: PFను సులువుగా ఇలా విత్‌డ్రా చేసుకోండి

అయితే.. ఈ ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని అందించడానికి గతంలో తమవద్ద కొన్ని పెట్టుబడులను నగదు రూపంలోకి మార్చాలని EPFO యోచించింది. కానీ కోవిడ్-19 (Coronavirus) మహమ్మారి కారణంగా.. మార్కెట్లు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుండటంతో ఈ నిర్ణయాన్ని విరమించుకుంది. ఇదిలాఉంటే.. నిర్ణయంపై ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి వ్యవస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT)  సమావేశం మరోసారి డిసెంబరులో జరుగనుంది. Also read: పెన్షనర్లకు EPFO గుడ్ న్యూస్..

మార్చిలో కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ నేతృత్వంలో జరిగిన బోర్డు సమావేశంలో 2019-20 సంవత్సరానికి గాను ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీని అందించాలని నిర్ణయించిన సంగతి మనందరికీ తెలిసిందే.  Also read: గుడ్ న్యూస్.. ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ సరికొత్త సదుపాయం

Trending News