భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గత కొన్ని రోజులుగా 90వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 90,802 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే భారత్‌లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య (COVID19 Positive Cases In India) 42,04,613 (62 లక్షల 4వేల 613)కు చేరింది. దీంతో ప్రపంచంలో అత్యధిక కేసులలో భారత్ రెండో స్థానానికి (India surpassed Brazil) చేరుకుంది. ఆదివారం వరకు బ్రెజిల్ కరోనా కేసులలో రెండో స్థానంలో ఉంది. Telangana: తాజాగా 1,802 కరోనా కేసులు 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Isha Koppikar Photos: ‘చంద్రలేఖ’ నటి గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూడండి


గత కొన్ని రోజులుగా బ్రెజిల్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా, భారత్‌లో విపరీతంగా కోవిడ్19 కేసులు పుట్టకొస్తున్నాయి. బ్రెజిల్‌లో ఇప్పటివరకూ 41 లక్షల 40వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం అమెరికా మాత్రమే కరోనా కేసులలో భారత్ కన్నా ముందుంది. కేసుల తీవ్రత ఇలాగే పెరిగితే అమెరికాను సైతం భారత్ వెనక్కి నెట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అధిక జనాభాతో కేసుల తీవ్రత భారీగా ఉండే అవకాశం ఉంది. SRH IPL 2020 Schedule: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 షెడ్యూల్ పూర్తి వివరాలు


గడిచిన 24 గంటల్లో 1,016 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో భారత్‌లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 71,642కు చేరింది. దేశంలో ప్రస్తుతం 8,82,542 యాక్టివ్ కేసులుండగా, 32,50,429 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతంగా ఉంది. Novak Djokovic Default: నిర్లక్ష్యానికి నొవాక్ జకోవిచ్ భారీ మూల్యం