యూఎస్ ఓపెన్‌లో సంచలనం. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ప్రపంచ నెంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ పోరు (Novak Djokovic disqualified from US Open 2020) ముగిసింది. డీఫాల్ట్ నిబంధనల ప్రకారం స్వీయ తప్పిదంతో యూఎస్ ఓపెన్ నుంచి జకోవిచ్ (Novak Djokovic) నాలుగో రౌండ్ (ప్రి క్వార్టర్స్)లో వైదొలిగాడు. జకోవిచ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కొట్టిన బంతి మహిళా లైన్ జడ్జి గొంతుకు బలంగా తాకింది. యూఎస్ ఓపెన్ డీఫాల్ట్ రూల్స్ ప్రకారం నెంబర్ వన్ ఆటగాడిని డిస్ క్వాలిఫై చేశారు. దీంతో జకో ప్రత్యర్థి పాబ్లో కారెనో బస్టా క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. Hyderabad Metro Rail Services: హైదరాబాద్‌లో ప్రారంభమైన మెట్రో రైలు సర్వీసులు
స్పెయిన్‌కు చెందిన పాబ్లో కారెనో బస్టాతో ప్రి క్వార్టర్ ఫైనల్స్‌లో జకోవిచ్ తలపడ్డాడు. తొలి సెట్ మధ్యలో ఓ బంతిని అనవసర షాట్ కొట్టడంతో లైన్ జడ్జి గొంతుకు బంతి తాకింది. దీంతో డీఫాల్ట్ నిబంధనల ప్రకారం ఏ ఆటగాడైనా.. ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా బలంగా కొట్టడం, లేక కోర్టులో నిర్లక్ష్యంగా వ్యవహరించినా టోర్నీ నుంచి అనర్హుడు అవుతాడని యూఎస్ ఓపెన్ ప్రకటన విడుదల చేసింది. Ian Bell: రిటైర్మెంట్ ప్రకటించిన ఇయాన్ బెల్
The ball throw that caused Novak Djokovic's disqualification #USOpen pic.twitter.com/5sRr7but0M
— We Are Tennis (@WeAreTennis) September 6, 2020
29 వరుస విజయాలతో దూసుకెళ్తున్న సెర్బియా స్టార్ జకోవిచ్‌కు ఇది తీవ్ర నిరాశను కలిగించే అంశమే. ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా.. తన నిర్లక్ష్యానికి జొకో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అతడి ప్రైజ్ మనీతో పాటు ఈ టోర్నీలో నెగ్గిన పాయింట్లను తొలగిస్తారు. ఏదైనా అదనపు జరిమానా విధించినా జకోవిచ్ చెల్లించాల్సి వస్తుందని ప్రకటనలో తెలిపారు. Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు
Isha Koppikar Photos: ‘చంద్రలేఖ’ నటి గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూడండి