భారత దేశపు తొలి మహిళా టీమ్ స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (స్వాట్-SWAT) శుక్రవారం ఏర్పాటైంది. పూర్తి మహిళా కమాండో స్క్వాడ్‌లతో కూడిన మొదటి స్వాట్‌ టీమ్‌ ఇదే కావడం విశేషం. 36 మందితో కూడిన ఈ బృందం 15 నెలల పాటు భారత ఆర్మీ, ఇజ్రాయిల్ భద్రతాదళం వద్ద ప్రత్యేక శిక్షణ పొంది.. సేవలందించేందుకు సిద్దమైంది. ఈ బృందంలో ఉన్న మహిళలందరూ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు కాగా.. తీవ్రవాదుల ఊహకందని రీతిలో దాడులను తిప్పికొట్టడం ఈ టీమ్ ప్రత్యేకత.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యుద్ధవిన్యాసాలతో పాటు ఆయుధాల నిర్వహణ వంటి టెక్నిక్స్‌లలో ఈ టీమ్ సభ్యులు ఆరితేరారు. నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌(ఎన్‌ఎస్‌జీ), లాంగ్వేజ్‌ సంబంధించిన శిక్షణ కూడా తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సేవలందిస్తున్న ఐదు కమాండో టీమ్‌లతో కలిసి ఈ మహిళా టీమ్ కూడా సేవలందిస్తుందని సీనియర్ ఢిల్లీ పోలీస్ అధికారి ప్రమోద్ కుష్వాహా తెలిపారు.    


పంద్రాగస్టున స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ సందేశం ఇస్తుండగా.. ఈ కొత్త షీ టీమ్ భద్రతను పర్యవేక్షిస్తుంది. ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం స్వాట్‌ టీమ్‌ను నియమించింది. దేశ రాజధానితో పాటు ప్రధాని మోదీకి భద్రతగా హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ బృందాన్ని ఢిల్లీ పోలీసు శాఖలో నియమించారు.