Covid-19: ఒక్కరోజులో 6.6లక్షలకు పైగా టెస్టులు
దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) బాధితుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా టెస్టులను కూడా పెంచాయి.
Coronavirus tests in India: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) బాధితుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా టెస్టులను కూడా పెంచాయి. అయితే గత 24 గంటల్లో కరోనా వైరస్ నిర్ధారణ కోసం మొట్టమొదటి సారిగా ఆరున్నర లక్షలకుపైగా పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్స్ (ICMR), కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ ( Ministry of Health ) తెలిపాయి. భారత్‌లో ఒకే రోజులో అత్యధిక పరీక్షలు ఇదే మొదటిసారని మంగళవారం వెల్లడించాయి. Also read: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు కరోనా
కోవిడ్-19 (Covid-19) పై జరుగుతున్న పోరాటంలో గత 24 గంటల్లో 6,61,715 పరీక్షలను చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్ ట్వీట్టర్ వేదికగా తెలిపాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,08,64,206 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించాయి. ఇదిలాఉంటే దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 18 లక్షలు దాటింది. కరోనాతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే మృతి