Honeymoon Places: కొత్తగా పెళ్లయిన జంటలకు బెస్ట్ హానీమూన్ ప్రాంతాలివే
Honeymoon Places: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ నెలంతా మంచి ముహూర్తాలు ఉండటంతో పెద్దఎత్తున పెళ్లిళ్లు జరుగుతున్నాయి. చలికాలం కూడా కావడంతో పెళ్లయిన జంటలు హానీమూన్ ఎక్కడైతే బాగుంటుందోనని ప్లాన్ చేస్తుంటారు. ఆ వివరాలు మీ కోసం.
Honeymoon Places: కొత్తగా పెళ్లయిన జంటలకు హానీమూన్ అనేది మర్చిపోలేని అనుభూతి. ఇప్పుడు డిసెంబర్ నెలంతా పెళ్లిళ్లతో బిజీ కావడంతో హానీమూన్ యాత్రలు ఊపందుకుంటాయి. ఈ చలికాలంలో కొత్త వధూవరులు ఏకాంతంగా, రొమాంటిక్‌గా గడిపేందుకు ఎక్కడో విదేశాలకు వెళ్లాల్సిన అసవరం లేదు. మన దేశంలోనే అద్భుతమైన ప్రదేశాలున్నాయి.
చలికాలం కొత్తగా పెళ్లయిన జంటలకు మంచి అనుభూతిని అందిస్తుంది. అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలకు హానీమూన్ ప్లాన్ చేస్తే ఈ అనుభూతి మరింతగా పెరుగుతుంది. అలాంటి అందమైన, ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన, ఏకాంతమైన ప్రదేశాలేమున్నాయో పరిశీలిద్దాం. బెస్ట్ హానీమూన్ ప్లేస్ అంటే ముందుగా గుర్తొచ్చేది కేరళ. కేరళ బ్యాక్‌వాటర్స్‌లో హౌస్ బోట్ ప్రయాణం హానీమూన్ కోసం మంచి ఆప్షన్. అందమైన ప్రకృతి దృశ్యాలు చూస్తూ హౌస్ బోట్‌లో ఏకాంతంగా గడపవచ్చు. ఇక మున్నార్‌లోని టీ తోటలు, పచ్చని పొలాలు, చలి వాతావరణం హానీమూన్ యాత్రను మధురంగా మారుస్తాయి.
అండమాన్ నికోబార్ దీవుల్లో హానీమూన్ యాత్ర మరింత అద్భుతమైంది. స్వచ్ఛమైన నీరు, తెల్లటి ఇసుకతో కూడిన బీచ్‌లు ఆకట్టుకుంటాయి. స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ ద్వారా సముద్ర జీవుల్ని వీక్షించవచ్చు. ఇక గోవా కూడా హానీమూన్ యాత్రకు మంచి ప్లేస్. పార్టీలకు చాలా బాగుంటుంది. గోవాలో కూడా స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయవచ్చు.
ఇక ప్రకృతి రమణీయత, అందమైన ప్రదేశాలకు కేరాఫ్ రాజస్థాన్, శ్రీనగర్ ప్రాంతాలు. శ్రీనగర్‌లో దాల్ సరస్సలో హౌస్ బోట్ ప్రయాణం కొత్తగా పెళ్లయిన జంటలకు మంచి అనుభూతిని అందిస్తుంది. హిమాలయాల అందాలు, ధారాళంగా కురిసే మంచు, మంచు దుప్పటి కప్పుకున్న ప్రకృతి అందాలు ముగ్దమనోహరంగా ఉంటాయి. రాజస్థాన్ సంస్కృతిని ఆస్వాదించేందుకు, వీక్షించేందుకు బాగుంటుంది. ఎంజాయ్ చేసేందుకు ఉదయపూర్ చాలా బాగుంటుంది.
Also read: Maharashtra: వీడిన మహారాష్ట్ర పీటముడి, ముఖ్యమంత్రిగా ఇవాళ దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.