Ayodhya Flights: జనవరి 15, 17 నుంచి అయోధ్యకు ఇండిగో, ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు, టైమింగ్స్ ఇవీ
Ayodhya Flights: మరి కొద్దిరోజుల్లో అయోధ్య రామమందిరం ప్రారంభం కానున్న నేపధ్యంలో అన్ని దార్లు అయోధ్యకే పరుగులు తీస్తున్నాయి. దేశంలోని వివిధ నగరాల్నించి అయోధ్యకు నేరుగా విమానాలు నడవనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ayodhya Flights: జనవరి 22వ తేదీన యావత్ హిందూవులు ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. దేశ విదేశాల నుంచి తరలివచ్చే వీవీఐపీలు, భక్తజనం సమక్షంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అత్యంత ఘనంగా చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అయోధ్యకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది.
దేశం నలుమూలల్నించి అయోధ్యకు తాకిడి పెరగనున్న నేపధ్యంలో విమానయాన సంస్థలు సైతం అయోధ్యకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఎయిర్ ఇండియా జనవరి 17 నుంచి, ఇండిగో ఎయిర్ లైన్స్ జనవరి 15 నుంచి అయోధ్యకు విమానాలు నడపనున్నాయి. ఎయిర్ ఇండియా బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ నుంచి నేరుగా అయోధ్యకు విమానాలు నడపనున్నాయి. అయోధ్యలో కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయోధ్య ధామ్‌కు ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా నగరాల్నించి నేరుగా విమానాలు నడవనున్నాయి.
మరోవైపు ఢిల్లీ, అహ్మదాబాద్‌తో పాటు ముంబై నుంచి కూడా ఇండిగో ఎయిర్‌లైన్స్ అయోధ్యకు నేరుగా విమానాలు నడపనుంది. ముంబై నుంచి అయోధ్యకు మద్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి 2.45 గంటలకు చేరుకుంటుంది. అయోధ్య నుంచి ముంబైకు మద్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి 5.40 గంటలకు చేరుకుంటుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాలు జనవరి 17 నుంచి ప్రారంభం కానున్నాయి.
Also read: Aditya L1 Mission: ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతం, మరో ఘనత సాధించిన ఇస్రో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook