Karnataka Hasan Twin Sisters Score Same Marks In 10Th and Intermediate: మనం సాధారణంగా కవల పిల్లలు పుట్టారనగానే, పిల్లలను చూడటానికి అందరు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. పుట్టిన పిల్లలు అచ్చం ఒకేలా ఉంటారు. కొందరు ఒక పిల్లాడు ఏడ్వగానే మరో పిల్లాడు ఏడుస్తుంటారు. ఒకరు పడుకోగానే మరోకరు పడుకుంటారు. మొత్తానికి కొందరిలో ఇది మాత్రం అచ్చం హాలో బ్రదర్ మాదిరిగా ఉంటుంది. కానీ కొందరు ఈవిషయాలను మాత్రం కొట్టి పారేస్తుంటారు. కవలలుగా పుట్టినంత మాత్రన ఓకేలా ప్రవర్తించాలని లేదు. కొందరు ఒకే పొలికలతో పుట్టిన మరికొందరు మాత్రం కాస్తంత డిఫరెంట్ గాను ఉంటారు. ఇక పొలికల విషయం పక్కన పెడితే.. కర్ణాటకలోని హసన్ కు చెందిన ఇద్దరున కవల అక్కా చెల్లెళ్లు మాత్రం అరుదైన ఘనత సాధించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్తి వివరాలు..


నార్మల్ గా కవలలు అంటే చూడ్డానికి ఇద్దరూ ఓకేలా ఉంటారు. కానీ వారి అలవాట్లు, అభిరుచులు మాత్రం కాస్తంత భిన్నంగా ఉంటాయి. ఏవో కొన్ని విషయాల్లో మాత్రమే వారికి ఒకరి పోలికలతో మరోకరివి మ్యాచ్ అవుతుంటాయి. ఇప్పుడు మనంతెలుసుకోబోతున్న కవలలు అన్ని విషయాల్లో ఒకేలా ఉంటారు. చూడటానికి ఇద్దరు కూడా అచ్చు గుద్దినట్లు ఉంటారు. చివరకు చదువు, మార్కుల విషయంలో కూడా ఒకేలా అన్నమాట. తాజాగా విడుదలైన ఇంటర్ పరీక్షల్లో వీరిద్దరూ ఒకేలా మార్కులు తెచ్చుకుని.. అందరిని నోరెళ్ల బెట్టేలా చేశారు. అది కూడా టాప్ మార్కులు కావడం అందరిని మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. .


కర్ణాటకలోని హాసన్ ప్రాంతానికి చెందిన కవల అక్కాచెల్లెళ్లు ఈ ఘనత సాధించారు. రెండు నిమిషాల తేడాతో పుట్టిన ట్విన్స్‌ చుక్కి, ఇబ్బని ఒకే పోలికతో ఉండటమే కాకుండా..  తాజాగా విడుదలైన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో కూడా ఒకేలా మార్కులు కూడా సాధించారు.  వీరిద్దరు ఇంటర్  లో.. 600 మార్కులకు గాను ఇద్దరూ 571 మార్కులు సాధించారు. అంతే కాదు గతంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఇలాంటి వింత జరిగిందని తల్లిదండ్రులు వెల్లడించారు.  పదో తరగతిలో ఇద్దరూ 625 మార్కులకు గాను 620 మార్కులు తెచ్చు కున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం వీరిద్దరు కూడా.. కర్ణాటకలోని హసన్ నగరంలో ఎన్డీఆర్కే పీయూ కాలేజీలో 12వ తరగతిపూర్తి చేశారు.


Read More: Swiggy Delivery Boy: స్విగ్గీ బాయ్ పాడుపని... పార్శీల్ డెలీవరీ ఇవ్వడానికి వచ్చి.. వైరల్ వీడియో..


ప్రస్తుతం వీరిద్దరు నీట్‌ ఎగ్జామ్ కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తొంది. నీట్‌ రిజల్ట్ లను బట్టి ఇంజనీరింగాచదవాలా.. లేదా మెడిసిలా  అనేది నిర్ణయించుకుంటారట. వీరిద్దరుచదువుల్లో మాత్రమే కాకుండా.. సంగీతం, డ్యాన్స్, ఆటల్లో కూడా వీరిద్దరు ముందుంటారంట. తమ బిడ్డలు సాధించిన ఘనతపై.. తండ్రి వినోద్ చంద్ర ఆనందంవ్యక్తం చేశారు. తమ బిడ్డలు ఇద్దరు ప్రతి విషయంలోను పోటీపడి, కష్టపడి చదువుతారంటూ తండ్రి గర్వంగా చెప్పుకున్నారు.  ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.  


Read More: Snake Swallows Itself: బాప్ రే.. తన తోకను తానే మింగేస్తున్న పాము.. వైరల్ గా మారిన వీడియో..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook