India to resume international flights: దేశీయంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది పౌర విమానయనాన శాఖ. ప్రయాణ ఆంక్షల విధించిన (భారత్ విధించిన) 14 దేశాలకు తప్పా మిగతా దేశాలన్నింటికి విమానాల రాకపోకలు (India Travel Ban on 14 countries) సాగుతాయని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రయాణ ఆంక్షలు ఉన్న దేశాల జాబితాలో.. చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్​, బంగ్లాదేశ్​, బ్రిటన్​, సింగపూర్​, న్యూజిలాండ్, హాంకాంగ్, జింబాబ్వే, మారిషస్​,బోట్స్​వానా, ఇజ్రాయెల్​ వంటి దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో ప్రపంచానికి కొత్త సమస్యగా మారిన కరోనా B.1.1.529 కేసులు (Corona new Variant) బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలకు విమాన సేవలపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. అయితే ఆయా దేశాలకు ఎయిర్​ బబుల్ ఒప్పందంతో పరిమిత సంఖ్యలో విమాన సేవలు కొనసాగొచ్చని సమాచారం.


కొత్త వేరియంట్​కు ప్రధాన కేంద్రమైన దక్షిణాఫ్రికాకు (India tranve Ban on South Africa) మాత్రం విమాన సేవలు పూర్తిగా నిలిచిపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే పలు దేశాలు దక్షిణాఫ్రికాపై ప్రయాణ ఆంక్షలు విధించడం గమనార్హం.


గత ఏడాది నిషేధం..


కరోనా విజృంభణ (Corona virus in India) నేపథ్యంలో గత ఏడాది మార్చి నుంచి అంతర్జాతీయ విమాన సేవలపై కేంద్రం నిషేధం విధించింది. అయితే ఎయిర్​ బబుల్ ఒప్పందం ద్వారా  కఠిన కొవిడ్ నిబంధనల నడుమ కొన్ని దేశాలకు ప్రత్యేక విమానాలు నడుపుతూ వచ్చింది. తాజాగా పూర్తి స్థాయిలో విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి.


కరోనా ఆంక్షలు విధించినప్పటికి వివిద దేశాల్లో ఉన్న భారతీయుల కోసం వందే భారత్ పేరుతో ప్రత్యేక విమానాలు నడిపించింది భారత్​.


Also read: Navy officer: కుటుబంతో విహార‌యాత్ర‌కు వెళ్లి.. స‌ముద్రంలో శవమై తేలిన నేవీ అధికారి


Also read: Madhya Pradesh: ఉధంపూర్-దుర్గ్‌ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు ..రెండు బోగీలు దగ్ధం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook