Navy officer: కుటుబంతో విహార‌యాత్ర‌కు వెళ్లి.. స‌ముద్రంలో శవమై తేలిన నేవీ అధికారి

Navy officer, on vacation, drowns at Kovalam beach near Chennai : కుటుంబంతో విహార‌యాత్ర‌కు వెళ్లిన ఆయన స‌ర‌దాగా గ‌డుపుడుతుండగా.. ఒక్క‌సారిగా అల‌ల్లోప‌డి కొట్టుకుపోయాడు. కుటుంబం కళ్లెదుటే ఆయన నీళ్ల‌లో మునిగిపోయాడు. తమిళ‌నాడు రాజ‌ధాని చెన్నైకి (Chennai) స‌మీపంలోని కోవ‌ల‌మ్ బీచ్‌లో తాజాగా ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2021, 08:45 PM IST
  • స‌ర‌దాగా గ‌డిపేందుకు వెళ్లి స‌ముద్ర‌పు అల‌ల్లో కొట్టుకుపోయిన వ్యక్తి
  • కుటుంబం కళ్లెదుటే నీళ్ల‌లో మునిగిపోయిన ఇండియ‌న్ నేవీ లెఫ్టినెంట్ క‌మాండ‌ర్‌
  • చివరకు శవమై తేలిన నేవీ అధికారి
Navy officer: కుటుబంతో విహార‌యాత్ర‌కు వెళ్లి.. స‌ముద్రంలో శవమై తేలిన నేవీ అధికారి

Navy officer on vacation in Chennai, drowns at Kovalam beach; body recovered : కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపేందుకు సెల‌వుపై వెళ్లిన నేవీ అధికారి శవమై తేలాడు. స‌ముద్ర‌పు అల‌ల రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు ఆ నేవీ అధికారిని చంపేసింది. కుటుంబంతో విహార‌యాత్ర‌కు వెళ్లిన ఆయన స‌ర‌దాగా గ‌డుపుడుతుండగా.. ఒక్క‌సారిగా అల‌ల్లోప‌డి కొట్టుకుపోయాడు. కుటుంబం కళ్లెదుటే ఆయన నీళ్ల‌లో మునిగిపోయాడు. తమిళ‌నాడు రాజ‌ధాని చెన్నైకి (Chennai) స‌మీపంలోని కోవ‌ల‌మ్ బీచ్‌లో తాజాగా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. 

Also Read : Shiva Shankar Master: శివశంకర్ మాస్టర్ కుటుంబానికి మెగాస్టార్ ఆర్థిక సాయం

ఇండియ‌న్ నేవీలో లెఫ్టినెంట్ క‌మాండ‌ర్‌గా (Lieutenant Commander) ప‌ని చేసే జేఆర్ సురేష్ (JR Suresh)..ఢిల్లీలో విధులు నిర్వ‌హించేవారు. ఇటీవ‌ల ఆయ సెల‌వుపై త‌మిళ‌నాడులోని స్వ‌స్థ‌లానికి వ‌చ్చారు.  భార్యాపిల్లలతో కలిసి సరదాగా కోవ‌ల‌మ్ (Kovalam) బీచ్‌కు వెళ్లారు. అక్క‌డ భార్యాపిల్లలతో జేఆర్ సురేష్ స‌ర‌దాగా గ‌డుపుతుండగా ఒక్కసారిగా అల‌లు ముంచుకొచ్చాయి. ఆయన్ని అకస్మాత్తుగా తీసుకెళ్లాయి. స‌మాచారం అందుకున్న నేవీ బ‌ల‌గాలు వెంట‌నే రంగంలోకి దిగి ఆయ‌న కోసం వెతికారు. చివరకు కేలంబ‌క్క‌మ్ (Kelambakkam) ప్రాంతంలో జేఆర్ సురేష్ (JR Suresh) మృత‌దేహం దొరికింది. దీంతో ఆ కుటుంబ రోదనలు మిన్నంటాయి.

Also Read : Palmistry: మీ చేతి రేఖలు ఇలా ఉన్నాయా..?? అయితే మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నారని అర్థం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News