త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీకి అక్కడి మిత్రపక్షంగా ఉన్న ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ)  పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది. త్రిపురలోని గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. అందుకు కోసం కేంద్ర ప్రభుత్వం ఒక మానిటరింగ్ కమిటీని వేస్తుందని తాము భావిస్తున్నామని తెలిపింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఐపీఎఫ్‌టీ అధ్యక్షుడు ఎన్.సి.దేవ్ వర్మ ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు.


బీజేపీ, ఐపీఎఫ్‌టీ ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి.. పాతికేళ్ళ లెఫ్ట్ ఫ్రంట్ పాలనను అంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాము ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నాం కాబట్టే బీజేపీకి మద్దతు ఇచ్చామని ఐపీఎఫ్‌టీ తెలపడం విశేషం. త్రిపురలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం అయితే భారతీయ
జనతా పార్టీ వద్ద ఉండనే మరి. మరి ఐపీఎఫ్‌టీ డిమాండ్ పట్ల మోదీ సర్కారు ఎలా స్పందిస్తుందనే విషయంలో మాత్రం వేచి చూడక తప్పదు