Railway Destination Alert: సాధారణంగా ప్రయాణాల్లో నిద్రపోవడం చాలామందికి అలవాటు. ఇక రాత్రిపూట ప్రయాణాలైతే చెప్పేదేముంది. తెలియకుండానే చాలామంది నిద్రలోకి జారుకుంటారు. బస్సు ప్రయాణాల్లో అయితే కండక్టర్ ప్రయాణికులను అలర్ట్ చేస్తుంటాడు. కానీ రైలు ప్రయాణాల్లో ఆ సదుపాయం ఉండదు కదా. ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారంటే.. కొన్నిసార్లు దిగాల్సిన స్టేషన్ దాటిపోయాక నిద్ర లేస్తుంటారు. ఇలా జరగకుండా ఉండేందుకు ప్రయాణికుల సౌకర్యార్థం ఐఆర్‌సీటీసీ 'డెస్టినేషన్ అలర్ట్' పేరిట కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఎలా పనిచేస్తుంది.. ప్రయాణికులు దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డెస్టినేషన్ అలర్ట్ :


డెస్టినేషన్ అలర్ట్ రాత్రి 10 గం. నుంచి ఉదయం 7గం. వరకు అందుబాటులో ఉంటుంది. ఆ సమయంలో రైల్వే ప్రయాణం చేసేవారు దీన్ని ఉపయోగించుకోవచ్చు. తద్వారా నిద్రలోకి జారుకున్నా.. దిగాల్సిన స్టేషన్ వచ్చేందుకు 20 నిమిషాల ముందు గానే ప్రయాణికులకు ఎస్ఎంఎస్‌తో పాటు ఫోన్ కాల్ ద్వారా అలర్ట్ అందుతుంది. వెంటనే అప్రమత్తమై నిద్ర నుంచి తేరుకుంటే దిగాల్సిన స్టేషన్‌ వచ్చేసరికి కంగారు పడాల్సిన అవసరం ఉండదు.


డెస్టినేషన్ అలర్ట్ ఎలా పొందాలి :


రైల్వే ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ నుంచి 139కి డయల్ చేయాలి.


తెలుగు, హిందీ, ఇంగ్లీష్.. వీటిల్లో మీ ప్రాధాన్యత భాషను ఎంచుకోవాలి.


ఆ తర్వాత ఐవీఆర్ మెనూలో ఆప్షన్ 7 ఎంచుకోవాలి.


అనంతరం 2 నంబర్‌పై ప్రెస్ చేసి మీ 10 అంకెల పీఎన్ఆర్ నంబర్ ఎంటర్ చేయాలి.


చివరలో కన్ఫర్మ్ కోసం 1 నంబర్ ప్రెస్ చేయాలి.


ఇలా కూడా డెస్టినేషన్ అలర్ట్ పొందవచ్చు :


ప్రయాణికులు తమ ఫోన్‌లో ఎస్ఎంఎస్ ద్వారా కూడా డెస్టినేషన్ అలర్ట్ పొందవచ్చు. ఇందుకోసం తమ మొబైల్ నుంచి 139 నంబర్‌కు 'Alert' అని టైప్ చేసి పంపించాలి. అంతే.. డెస్టినేషన్ అలర్ట్ యాక్టివేట్ అవుతుంది. అయితే ఈ సర్వీస్ ఉచితం కాదు. ఎస్ఎంఎస్‌కి రూ.3, ఫోన్‌కాల్ అలర్ట్‌కి రూ.3/రూ.2 ఛార్జీ చేయబడుతుంది.


Also Read: Samantha Ruth Prabhu: తెలుగు నుంచి సమంతకు అరుదైన గౌరవం.. మొదటి హీరోయిన్ గా!


Also Read: Mars Transit 2022: మేష రాశిలో కుజుడి సంచారం.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్ట సమయం..  



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook