Mars Transit 2022: మేష రాశిలో కుజుడి సంచారం.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్ట సమయం..

Mars Transit 2022: కుజుడి రాశి మార్పు 3 రాశుల వారికి విశేషంగా కలిసిరానుంది. ఈ కాలంలో వారికి తిరుగుండదనే చెప్పాలి. ఆ మూడు రాశులేంటో.. వారికి కలిగే శుభ ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకోండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2022, 09:10 AM IST
  • మేష రాశిలోకి కుజుడి ప్రవేశం
  • ఆగస్టు 10 వరకు మేష రాశిలోనే కుజుడు
  • కుజుడి సంచారం 3 రాశుల వారికి విశేషంగా కలిసొస్తుంది
Mars Transit 2022: మేష రాశిలో కుజుడి సంచారం.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్ట సమయం..

Mars Transit 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాలానుగుణంగా గ్రహాల మార్పు జరుగుతుంది. గ్రహ సంచారంలో మార్పు రాశిచక్రంలోని 12 రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావం కొన్ని రాశులకు శుభ ఫలితాలనిస్తే.. మరికొన్ని రాశుల వారికి అశుభం కలగజేస్తుంది. ఆయా రాశుల వారి జాతకంలో.. ఆయా రాశులు ఏ స్థానంలో సంచరిస్తాయో దాన్ని బట్టి సానుకూల, ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం కుజుడు మేష రాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 27న మేష రాశిలోకి ప్రవేశించిన కుజుడు.. ఆగస్టు 10 వరకు అందులోనే కొనసాగనున్నాడు. ఇది రాశిచక్రంలోని 3 రాశుల వారికి అన్నివిధాలుగా కలిసిరానుంది.

మిథునం (Gemini) : మిథున రాశి ఏడవ ఇంటికి కుజుడు అధిపతి. కుజుడు మేష రాశిలో సంచరించే కాలంలో మిథున రాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది. గృహ లేదా వాహన కొనుగోలుకు అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. పెట్టుబడులు లాభాలు తీసుకొస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఆర్థికపరంగా ఎటువంటి లోటు ఉండదు. ఇతరులకు సాయం చేసే స్థానంలో ఉంటారు తప్ప ఎవరి నుంచి ఆశించరు.

కర్కాటక రాశి (Cancer) : కర్కాటక రాశిలోని పదవ ఇంట్లో కుజుడు సంచరిస్తున్నాడు. ఇది కార్య సిద్ధికి సంకేతం. అంటే.. చేపట్టిన ప్రతీ పనిలో తిరుగులేని విజయం సొంతమవుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఆదాయ పెరుగుదల, పదోన్నతి ఉండొచ్చు. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ చేపట్టేందుకు అనుకూల సమయం. కొంతమంది భాగస్వాములతో కలిసి భారీ ఎత్తున వ్యాపారాన్ని ప్లాన్ చేస్తారు. ముత్యపు రత్నాన్ని ధరించడం ద్వారా ఈ కాలంలో మరింత కలిసొస్తుంది.

సింహం (Leo) : ప్రస్తుతం సింహ రాశి తొమ్మిదో ఇంట్లో కుజుడు సంచరిస్తున్నాడు. ఇది అదృష్టానికి సంకేతం. ఈ కాలంలో విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగుండదు. భవిష్యత్ గురించి బెంగపడాల్సిన అవసరం లేకుండా.. ఆర్థికంగా చాలా ప్రయోజనం పొందుతారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు అదృష్టం వెన్నంటే ఉంటుంది. పగడపు రత్నాన్ని ధరించడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. 

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో 99.18 శాతం పోలింగ్.. ఆ రాష్ట్రాల్లో 100 శాతం ఓటింగ్   

Also Read: Neet Dress Code: నా కూతురి లోదుస్తులు విప్పించారు.. నీట్ పరీక్షలో డ్రెస్ కోడ్‌పై పోలీసులకు ఓ తండ్రి ఫిర్యాదు..  

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News