ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ ( IRCTC) టికెట్లు బుక్ చేయడానికి కొత్త నియమాన్ని ప్రకటించింది. ఈ కొత్త నియమం ప్రకారం ట్రైన్ కదలడానికి 30 నిమిషాల ముందు సెకండ్ చార్ట్ సిద్ధం అవుతుంది. అంతకు ముందు ప్రయాణికుల సౌలభ్యం కోసం ట్రైన్ ప్రారంభం అయ్యే రెండు గంటల ముందు చార్ట్ ప్రిపేర్ అయ్యేది. కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వల్ల ఇలా రెండు గంటల ముందే బుక్ చేసేవాళ్లు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read | ATM Centerలో జ్యూస్ పార్లర్..మహారాష్ర్టలో వింత వ్యాపారం


డిపార్చర్ కు 4 గంటల ముందు మొదటి చార్ట్ ప్రిపేర్ అయ్యేది. మిగితా టికెట్లను ప్రయాణికులు కౌంటర్ల వద్ద ఉన్న ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందు టికెట్లు బుక్ అవుతాయి.



Also Read | Amazon Web Services: హైదరాబాద్‌లో అమేజాన్ 20 వేల పెట్టుబడులు


చివరి నిమిషంలో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే వారికి ఈ కొత్త నియమం బాగా ఉపయోగపడుతుంది. చార్ట్ ప్రిపేర్ కాక ముందు టికెట్ బుక్ చేసుకోవడం లేదా క్యాన్సిల్ చేసుకునేవారికి ఈ కొత్త రూల్ ఉపయుక్తంగా ఉంటుంది.


IRCTC నుంచి టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు.
This How You Can Book Tickets From IRCTC
1. సంస్థ అధికారిక పోర్టల్ irctc.co.in/nget/train-searchను విజిట్ చేయండి
2. అక్కడ అడిగిన వివరాలను అందించండి.
3. ఫైండ్ ట్రెయిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి
4. మీ ట్రైన్ ను ఎంచుకోండి
5. ఎవైలబిలిటీ ఆప్షన్ అండ్ ఫేర్ జర్నీపై క్లిక్ చేయండి
6. మీకు కావాల్సిన తేదీపై బెర్త్ ఫేర్, సీట్ల నెంబర్లు మీముందు కనిపిస్తాయి.



Also Read | River in Thar: 2 లక్షల సంవత్సరాల ముందు ఎండిపోయిన నది జాడ దొరికింది
7. బుక్ నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి
8.IRCTC ఖాతాలోకి ఎంట్ అవ్వండి. మీ వివరాలు ఇవ్వండి.
9. ప్రయాణ చార్జీలు చెల్లించండి. మీ సీట్లు బుక్ అవుతాయి.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR