ATM Centerలో జ్యూస్ పార్లర్..మహారాష్ట్రలో వింత వ్యాపారం

ఏటీఎం సెంటర్లో సెక్యూరిటీ గార్డులు కుట్టు మిషిన్ పెట్టుకుని బట్టలు కుట్టడం చూశాం. కానీ ఏటీఎం ( ATM ) సెంటర్ లో జ్యూస్ పార్లర్ నడపడం ఎప్పుడైనా చూశారా ? అయితే ఇప్పడు చూస్తారు. 

Last Updated : Nov 6, 2020, 01:46 PM IST
    • ఏటీఎం సెంటర్లో సెక్యూరిటీ గార్డులు కుట్టు మిషిన్ పెట్టుకుని బట్టలు కుట్టడం చూశాం.
    • కానీ ఏటీఎం సెంటర్ లో జ్యూస్ పార్లర్ నడపడం ఎప్పుడైనా చూశారా ? అయితే ఇప్పడు చూస్తారు.
ATM Centerలో జ్యూస్ పార్లర్..మహారాష్ట్రలో వింత వ్యాపారం

Juice Shop in ATM Center| ఏటీఎం సెంటర్లో సెక్యూరిటీ గార్డులు కుట్టు మిషిన్ పెట్టుకుని బట్టలు కుట్టడం చూశాం. కానీ ఏటీఎం ( ATM ) సెంటర్ లో జ్యూస్ పార్లర్ నడపడం ఎప్పుడైనా చూశారా ? అయితే ఇప్పడు చూస్తారు. నిజానికి ఏటీఎం సెంటర్ల నిర్వహణపై బ్యాంకులు స్పష్టమైన ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసింది. ఏటీఎంలో డబ్బులు తీయడానికి వచ్చిన వినియోగదారులకు పూర్తి ప్రైవసీ, కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాయి బ్యాంకులు. కానీ మహారాష్ర్టలోని అమరావతిలో ఒక వ్యాపారి ఏటీఎం సెంటర్లోనే జ్యూస్ షాపు పెట్టి నిబంధనలను అన్నింటినీ తుంగలో తొక్కాడు.Also Read | Wild Dog Photos: వైల్డ్ డాగ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న కింగ్ నాగార్జున

కుర్చీలు, బల్ల, పరదా...
మహారాష్ట్రలోని ( Maharastra ) అమరావతిలో ఒక జ్యూస్ పార్లర్ నడిపే వ్యక్తి ఏటీఎం సేవలను పక్కాగా వినియోగించుకుంటున్నాడు. మిషిన్ పక్కనే కొన్ని కుర్చీలు వేసి దాని ముందు మంచి ప్లాస్టిక్ టేబుల్ వేశాడు. అటు ఏటీఎం మిషిన్ వాడేవారికి ఇబ్బంది కలగొద్దు.. ఇటు జ్యూస్ రుచిని ఆస్వాదించే వారి ప్రైవసీకి ఆటంకం కలగకుండా చిన్నపరదాను కూడా ఏర్పాటు చేశాడు. పైగా ఏటీఎం సెంటర్ లో మెన్యూ బోర్డు కూడా పెట్టేశాడు. 
Also Read | ఇటలీలో రాధేశ్యామ్ షూటింగ్ లొకేషన్ నుంచి Prabhas Latest Photos

 

నిబంధనలకు పాతర
ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడానికి వచ్చే వారి కోసం కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏటీఎం సెంటర్లో ఒకే వ్యక్తి మాత్రమే ఉండాలి అనేది అందులో ఒకటి. ఎందుకంటే డబ్బు తీసేటప్పుడు, లేదా బ్యాలెన్స్ చెక్ చేసేటప్పుడు మిగితావారికి పిన్ లాంటి వివరాలు తెలిస్తే మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. 

కానీ ఈ జ్యూస్ పార్లర్ గా మారిన ఏటీఎం సెంటర్లో డబ్బు తీసే సమయంలో జ్యూస్ తాగడానికి వచ్చే వినియోగదారులు ఉంటారు. అప్పుడు మోసాలు జరిగే అవకాశం ఉంది. పైగా కోవిడ్-19 (Covid-19 ) నియమాలను బేఖాతరు చేసి ఇలా వ్యాపారం నడుపుతున్నాడు జ్యూస్ పార్లర్ నిర్వాహకుడు. సదరు బ్యాంకు ఈ విషయాన్ని గమనించి వెంటనే చర్యలు తీసుకుంటుంది అని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు.

Also Read | Photos: నాగార్జున సాగర్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధిస్ట్ హెరిటేజ్ థీమ్ పార్కు

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News