Kerala Rename: కేరళంగా మారనున్న కేరళ, ఈసారైనా కేంద్రం పచ్చజెండా ఊపుతుందా
Kerala as Keralam: దేశంలో పేర్ల మార్పు వ్యవహారం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ నగరాల పేర్లు మారడం చూశాం. ఇప్పుడు ఏకంగా ఓ రాష్ట్రమే పేరు మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం వర్సెస్ రాష్ట్రం మధ్య పేరు మార్పు వివాదం నడుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Kerala as Keralam: ఇప్పుడిక నగరాలు, పట్టణాలు కాదు రాష్ట్రం కూడా పేరు మార్చుకోబోతోంది. గాడ్స్ ఓన్ కంట్రీగా పిల్చుకునే కేరళ పేరు మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. కేరళంగా మార్చాలనే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది. అయినా కేరళ ప్రభుత్వ వెనక్కి తగ్గనంటోంది.
అందమైన ప్రకృతితో పాటు అభివృద్ధిని సొంతం చేసుకున్న ప్రముఖ పర్యాటక ప్రాంతం కేరళ. కేరళ పేరును కేరళంగా మార్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రయత్నిస్తోంది. కేరళంగా పేరు మార్చుతూ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని సాంకేతిక కారణాలు సాకుగా చూపించి కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. అయినా వెనక్కి తగ్గని పినరయి ప్రభుత్వం మరోసారి అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపచేసుకుంది. ఆమోదం కోసం మరోసారి కేంద్రానికి పంపించనుంది.
రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో ఉన్న అన్ని భాషల్లో కేరళ పేరును కేరళంగా మార్చాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మలయాళంలో రాష్ట్రాన్ని కేరళంగా పిలిచేవారని ఈ సందర్భంగా పినరయి విజయన్ అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో గుర్తు చేశారు. మలయాళం మాట్లాడేవారికోసం ఐక్య కేరళ ఏర్పాటు డిమాండ్ స్వాతంత్ర్యం నుంచి ఉందన్నారు. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో తమ రాష్ట్రం పేరు కేరళగా ఉందని, దానిని కేరళంగా మార్చాలని కోరారు.
పేరు మార్పు కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడం ఇది రెండవసారి. గత ఏడాది ఆగస్టు నెలలో రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొన్ని సాంకేతిక మార్పుల్ని సూచించింది. ఈ మార్పుల్ని ఆమోదిస్తూ రెండవసారి కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. రాష్ట్రం పేరు మార్చాలనే డిమాండ్డ చాలా కాలంగా విన్పిస్తోంది. రాష్ట్రంలోని సాంస్కృతిక నేపధ్యం, చరిత్రను దృష్టిలో ఉంచుకుని కేరళంగా పేరు మార్చాలనే డిమాండ్ అన్నివర్గాల ప్రజల్నించి ఉంది. చరిత్రలో రాష్ట్రం పేరు కేరళంగానే ఉందని భాషా పండితులు కూడా తెలిపారు.
కేరళ పేరును కేరళంగా మార్చాలనే ప్రతిపాదనపై విమర్శలు కూడా వస్తున్నాయి. పేరు మార్చితే పరిపాలనాపరంగా చాలా మార్పులు చేయాల్సి వస్తుందని, అనవసర ఇబ్బందులు తలెత్తవచ్చని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈసారైనా కేరళ పేరు మార్పుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.
Also read: LPG Subsidy: ప్రజలకు మోదీ అద్భుతమైన శుభవార్త.. గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook