LPG Subsidy: ప్రజలకు మోదీ అద్భుతమైన శుభవార్త.. గ్యాస్‌ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ

Pradhan Mantri Ujjwala Yojana Beneficiaries Rs 300 Subsidy LPG Gas Cylinders: ఎన్నికల్లో బోటాబోటి సీట్లతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల సంక్షేమంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ప్రజలను ఆకట్టుకునేందుకు అద్భుతమైన పథకం అమలుకు సిద్ధమైంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 24, 2024, 07:27 PM IST
LPG Subsidy: ప్రజలకు మోదీ అద్భుతమైన శుభవార్త.. గ్యాస్‌ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ

PM Ujjwala Yojana: ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు అద్భుతమైన శుభవార్త వినిపించింది. ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌పై ఏకంగా రూ.300 రాయితీ ప్రకటించింది. మరో 9 నెలల పాటు ఈ సబ్సిడీని అందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉజ్వల యోజన ద్వారా అందిస్తున్న రూ.300 రాయితీని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Also Read: Budget 2024 25: కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగులకు భారీ ఊరట.. రూ.లక్షల్లో అద్భుత ప్రయోజనాలు

 

ఇటీవల 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పుడు 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.300 రాయితీని కొనసాగించేందుకు నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ముందు తీసుకున్న నిర్ణయాన్ని పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల్లో ప్రజల ఆగ్రహం గుర్తించిన మోదీ ప్రభుత్వం వారి ఆగ్రహం చల్లార్చే పనిలో మునిగింది. ఇకపై పేదలకు సంక్షేమం అందించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ప్రజలకు వరుసగా శుభవార్తలు అందించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రూ.300 సబ్సిడీ అందించనుందని తెలుస్తోంది. ఒక కుటుంబానికి 12 రాయితీ సిలిండర్లు అందనున్నాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

 

అయితే ఈ సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌పీజీ సిలిండర్‌ రాయితీ కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ రాయితీ కొనసాగే అవకాశం ఉంది. అనంతరం దీనిని పొడిగించాలా లేదా అనేది భవిష్యత్‌లో నిర్ణయం తీసుకుంటారు. 2016లో ప్రారంభించిన ఉజ్వల పథకం కింద ఇప్పటివరకు 10 కోట్ల కుటుంబాలకు కేంద్రం సిలిండర్లు అందించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News