మన దేశంలో ఏ విషయంపై వార్తలు వచ్చినా రాకపోయినా కరెన్సీపై మాత్రం ఏదో ఒకటి ప్రచారం జరుగుతుంటుంది. రూ.2000 నోట్లు రద్దు చేయనున్నారని, కొత్తగా రూ.1,000 నోటు తీసుకొస్తున్నారని వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇతర సామాజిక మాధ్యమాలలో మెస్సేజ్‌లు వైరల్ అవుతున్నాయి. కొత్త వెయ్యి రూపాయల నోటు ఇదేనంటూ పదే పదే మెస్సేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టతనిచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ఆ కార్డులు మార్చి 16 తర్వాత పనిచేయవు!


ఆర్బీఐ కొత్తగా రూ.1000 నోటు తీసుకొస్తుందన్న ప్రచారంలో నిజం లేదని పీఐబీ పేర్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోటును ఆర్బీఐ విడుదల చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. ‘ఆర్బీఐ రూ.1000 నోటు తీసుకురానుందని జరుగుతున్న ప్రచారం కేవలం వదంతి మాత్రమే. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఆ వెయ్యి రూపాయల నోటు ఫొటోను ఆర్బీఐ విడుదల చేయలేదని, ఇలాంటి నోటును తీసుకురావడం లేదని’ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేజీలో ఇటీవల షేర్ చేసి కరెన్సీ నోట్ల వదంతులపై స్పష్టతనిచ్చింది.


2నిమిషాల్లో పాన్ కార్డ్, ఆధార్ అనుసంధానం.. లేకపోతే కార్డ్ డెడ్!



కాగా, రూ.2000 నోట్లు రద్దు చేయనున్నారని గత నెలలో మరోసారి ప్రచారం జరిగింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి స్పందిస్తూ.. రూ.2000 నోట్ల రద్దు చేస్తున్నామని బ్యాంకులకు తాము సమాచారం ఇవ్వలేదని చెప్పారు. రెండు వేల నోట్లను ఖాతాదారులకు ఇవ్వరాదని తాము బ్యాంకులకు ఏ ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేయడం తెలిసిందే. రూ.500, రూ.1000 నోట్లు రద్దయిన నాటి నుంచి నిత్యం నోట్లు రద్దు చేస్తారనో లేక కొత్త నోట్లను ఆర్బీఐ తీసుకొస్తుందనో సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం అవుతూనే ఉన్నాయి.


See Pics: మొన్న పింక్ బికినీలో.. నేడు బ్లాక్ బికినీ..


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..