మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు రెండూ ఉన్నాయా.. ఉంటే మీరు చేయవలసిన పని వాటిని లింక్ చేయడం. ఈ రెండు లింక్ చేసుకోకపోతే దాదాపు రూ. 10,000 వరకు జరిమానా కట్టాల్సి వస్తుంది. ఆధార్ లేని పాన్ కార్డులను ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139ఏ (2) ప్రకారం రద్దు చేస్తామని సీబీడీటీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డును రద్దు చేస్తామని సైతం కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.
అట్టహాసంగా రక్షిత 9 రోజుల పెళ్లి వేడుక.. ఫొటో గ్యాలరీ
ఆన్‌లైన్‌లో పాన్, ఆధార్ కార్డులను అనుసంధానం చేసుకోవచ్చు. అయితే రెండు కార్డుల్లో మీ వివరాలు, ముఖ్యంగా పేరు ఒకే విధంగా ఉండాలి. పేరు, పుట్టిన తేదీ వివరాలు వేరువేరుగా ఉంటే కార్డుల లింకింగ్ సాధ్యపడకపోవచ్చు. మార్చి 31లోగా పాన్, ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకుని జరిమానాలు, ఇతర పరిణామాల నుంచి తప్పించుకోండి.
Buying TV, fridge, AC : టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ కొంటున్నారా ? అయితే ఇది చదవండి !
ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్ నుంచి అనుసంధానం
పాన్ కార్డ్, ఆధార్ కార్డుల్లో వివరాలు సరిగ్గా ఉన్నవారు పాన్ కార్డు - ఆధార్ కార్డు అనుసంధానం లింక్ మీద క్లిక్ చేసి వివరాలు సబ్ మిట్ చేస్తే లింక్ అవుతాయి.
ఈ లింక్ మీద క్లిక్ చేయండి
ఓపెన్ అయిన పేజీలో పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డు మీద ఉన్న పేరు ఇవ్వాలి. తర్వాత *ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డిటేల్స్ విత్ UIDAI* చెక్ బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్‌ను సరిగ్గా టైప్ చేసి Link Aadhar మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్, పాన్ లింక్ అవుతాయి.
బాలీవుడ్ బ్యూటీతో నాటీగా విజయ్ దేవరకొండ