ఆ కార్డులు మార్చి 16 తర్వాత పనిచేయవు!

నేడు డిజిటల్ కాలంలో దాదాపు బ్యాంకు ఖాతా ఉన్న అందరూ డెబిట్, క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే మార్చి 16 తర్వాత ఆ కార్డులతో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ చేయడం కుదరదని ఆర్బీఐ హెచ్చరిస్తోంది.

Last Updated : Mar 8, 2020, 05:56 PM IST
ఆ కార్డులు మార్చి 16 తర్వాత పనిచేయవు!

మీ వద్ద డెబిట్ లేక కార్డులున్నాయా. అయితే ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. వాటిలో కొందరు వినియోగదారుల కార్డులు మార్చి 16 నుండి పనిచేయకపోవచ్చు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ విషయంపై కార్డుదారులను జనవరి నెలలోనే హెచ్చరించింది. ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏ కార్డులు పనిచేయవు అనే మీ సందేహం కదా. ఆ వివరాలపై ఓ లుక్కేయండి.

See Pics: మొన్న పింక్ బికినీలో.. నేడు బ్లాక్ బికినీ..

కార్డుల సెక్యూరిటీ విషయంలో అలర్ట్ చేసే ఆర్బీఐ తాజాగా కొన్ని డెబిట్, క్రెడిట్ కార్డులు పనిచేయవని చెబుతోంది. మీ వద్ద ఉన్న ఈ కార్డుల్లో మార్చి 16వ తేదీ వరకూ ఒక్కసారి కూడా వినియోగించని కార్డు ఏమైనా ఉంటే అవి పనిచేయవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మీ వద్ద క్రెడిట్, డెబిట్ కార్డులను మార్చి 16లోగా కనీసం ఒక్కసారైనా వినియోగించాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.

తండ్రి ఆత్మహత్యపై అమృత రియాక్షన్ ఇలా ఉందా! 

డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల ట్రాన్సాక్షన్స్ సమయంలో సెక్యూరిటీ పెంచడంతో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు తరచుగా క్రెడిట్ లేక డెబిట్ కార్డులు వినియోగిస్తేనే వారి కార్డులకు సంబంధించి భద్రత కల్పంచడం తేలిక అవుతుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.  రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (RFID) టెక్నాలజీ ఆధారంగా ఈ కార్డులు పనిచేస్తాయని తెలిసిందే

ప్రణయ్ హత్యకేసు: అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య

మార్చి 16లోగా ఒక్కసారి కూడా ట్రాన్సాక్షన్‌కు వినియోగించని కార్డులను నేరుగా వినియోగించే అవకాశం ఉంది. దీనిపై మరికొన్ని రోజుల్లో ఆర్బీఐ స్పష్టత ఇవ్వనుంది.

స్త్రీ శక్తికి ‘హ్యాపీ ఉమెన్స్ డే’ విషెష్ ఇలా తెలపండి

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News