Fact Check: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు ఆసుపత్రి పాలవుతుండటంతో వ్యాక్సిన్ అంటే ప్రజలకు భయమేర్పడింది. అదే సమయంలో వ్యాక్సిన్ తీసుకుంటే 7 లక్షల మంది చనిపోతారని బిల్‌గేట్స్ అన్నట్టుగా వార్త వైరల్ అవుతోంది. ఏది నిజం..ఏది కాదు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ( Corona vaccination ) నడుస్తోంది. చాలామంది వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్‌తో ఆసుపత్రుల్లో చేరుతుండటంతో వ్యాక్సిన్ పట్ల ప్రజలకు భయమేర్పడుతోంది. వ్యాక్సిన్ తీసుకోడానికి వెనుకంజ వేస్తున్నారు. అదే సమయంలో బిల్‌గేట్స్ ( Bill Gates ) చెప్పినట్టుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వ్యాక్సిన్ తీసుకుంటే 7 లక్షల మంది చనిపోవడమో లేక వికలాంగులుగా మారడమో అవుతుందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ చెప్పారని..సోషల్ మీడియాలో వార్త హల్‌చల్ చేస్తోంది. ఇది నిజమని నమ్మిన జనం..వ్యాక్సిన్ తీసుకునేందుకు భయపడుతున్నారు. వ్యాక్సిన్ వేసుకోవద్దంటూ ఆ పోస్టును అందరికీ షేర్ చేస్తున్నారు. 


ఇంతకీ ఆయన నిజంగానే ఈ మాటన్నారా..దీనిపై జీ హిందూస్తాన్ పరిశోధించింది. నిజానికి బిల్‌గేట్స్ ఆ మాటెక్కడా అనలేదు. వ్యాక్సిన్ తీసుకుంటే 7 లక్షల మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముందని మాత్రమే అన్నారు. అంతే తప్ప చనిపోతారని ఎక్కడా అనలేదు. సో ఇది పక్కా ఫేక్ న్యూస్. సైడ్ ఎఫెక్ట్స్ ( Vaccine Side Effects ) వచ్చి..వాటంతటవే తగ్గిపోతాయని అన్నారు. సో..ఇది పూర్తిగా తప్పు వార్త..దయచేసి నమ్మవద్దు. 


Also read: Aeroponic Potato Farming: భూమిలో కాకుండా..గాలిలో పండే బంగాళాదుంపల్ని చూశారా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook