Srilanka Crisis:శ్రీలంక దారుణమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. జనాల ఆందోళనతో ప్రెసిడెంట్, ప్రధానమంత్రి తమ పదవులకు రాజీనామా చేశారు. అడ్డగోలుగా చేసిన అప్పులతోనే శ్రీలంకలో ఈ పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు పోటీపడి మరీ అప్పులు చేస్తున్నాయి. కొత్తగా అప్పు తేస్తేనే కాని ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. దీంతో ఏపీ, తెలంగాణలోనూ శ్రీలంక తరహా పరిస్థితులు ఏర్పడుతాయని విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. అధికార పార్టీలు మాత్రం ఖండిస్తూ వస్తున్నాయి. అయితే తాజాగా కేంద్ర సర్కార్ కూడా ఇదే విషయం చెప్పడం కలకలం రేపుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీలంక పరిస్థితులపై కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీలంక పరిస్థితులను వివరించిన కేంద్రం.. ఉచిత పథకాలు ,అనాలోచిత ఆర్థిక విధానాలు మంచివి కాదని సూచించింది. శ్రీలంక సంక్షోభ  పరిస్థితులను చూసి అప్రమత్తం కావాలని రాష్ట్రాలను కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా దేశంలోని 10 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై కేంద్ర ఆర్థికశాఖ అధికారులు ప్రత్యేక పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.  ఏపీ,  బీహార్‌, హర్యానా,  జార్ఖండ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి దారుణమైందన్నారు. ఈ రాష్ట్రాలు  ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే శ్రీలంక తరహా పరిస్థితులు వస్తాయని వెల్లడించింది. ఏపీలో అప్పులు జీఎస్‌డీపీలో 32 శాతంగా ఉన్నాయని... ఇది చాలా ప్రమాదకరమని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ఏపీ, బీహార్,, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాలు పరిమితికి మించి అప్పులు తీసుకున్నాయని వివరించింది.కేంద్రం చెప్పిన వివరాల ప్రకారం 2019-2022 మూడేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ బడ్జెటేతర మార్గాల నుంచి  28 వేల 837 కోట్ల అప్పు తీసుకుంది. ఏపీ విద్యుత్తు సంస్థలకు రూ.10,109 కోట్ల బకాయిలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరో 34 వేల  208 కోట్లకు గ్యారంటీలు ఇచ్చింది. తెలంగాణ రుణాలు జీఎస్‌డీపీలో 25 శాతానికి  చేరాయని కేంద్రం తెలిపింది.


అయితే శ్రీలంక పరిస్థిలపై నిర్వహించిన సమావేశంలో రాష్ట్రాల అప్పులను ప్రస్తావించడంపై టీఆర్ఎస్, వైసీపీ, టీఎంసీ, డీఎంకే పార్టీలు  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాష్ట్రాల అప్పులు సరే మరీ కేంద్ర సర్కార్ చేసిన అప్పుల పరిస్థితి ఏంటని ఆ పార్టీల ఎంపీలు నిలదీశారు. నరేంద్ర మోడీ ప్రధామంత్రి అయ్యాకా  కేంద్ర ప్రభుత్వం  95 లక్షల కోట్లు అప్పు చేసిందని, దాని గురించి వివరించాలని టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రాల అప్పులపై ప్రజెంటేషన్‌ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ జీఎస్‌డీపీలో 23%కి మించి అప్పులు చేసిందన్న కేంద్రం వాదనను కేశవరావు ఖండించారు. కేంద్రం అప్పులు జీడీపీలో 59%కి మించి ఉన్నాయని, దీనికి ఎవరు సమాధానమిస్తారని ప్రశ్నించారు. తీసుకున్న అప్పులను చెల్లించడంలో తెలంగాణ ఎప్పుడైనా శ్రీలంకలా విఫలమైందా? కానప్పుడు ఇలా ఎందుకు చెబుతారని నిలదీశారు. కేంద్రం రుణాలపైనా సమాధానం చెప్పాలని డీఎంకే, టీఎంసీతోపాటు పలు రాష్ట్రాలు డిమాండు చేయడంతో ఆర్థికశాఖ అధికారులు.. రాష్ట్రాల సంగతి వదిలేసి శ్రీలంక  పరిస్థితులు, భారత్‌ అందిస్తున్న సాయం గురించి వివరించారు. 


Also Read: Drones in Agriculture: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం... త్వరలో రైతులకు డ్రోన్లు..  


Also Read: Horoscope Today July 20th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు..   



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook