ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్‌వి - ఎఫ్ 10 ప్రయోగం విఫలమైంది. మొదటి రెండు దశలు సవ్యంగానే జరిగినా మూడవ దశ గురి తప్పింది. ఏం జరిగిందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీహరికోట(Sriharikota)లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో(ISRO) చేపట్టిన జియో సింక్రసిస్ లాంచ్ వెహికల్ -ఎఫ్ 10(GSLV-F10)ప్రయోగం విఫలమైందని ఇస్రో ఛైర్మన్ కే శివన్ వెల్లడించారు. దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థకు అనుసంధానం, దేశంలో విపత్తులు తలెత్తినప్పుడు ముందస్తు సమాచారం తెలుసుకోవడం కోసం ఈవోఎస్-03 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని వినియోగించాల్సి ఉంది. ఇందులో మల్టీ స్పెక్ట్రల్ విజుబుల్ అండ్ నియర్ ఇన్‌ఫ్రారెడ్, హైపర్ స్పెక్ట్రల్ షార్ట్‌వేవ్ ఇన్‌ఫ్రారెడ్ పేలోడ్స్‌గా అమర్చారు. భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి సూపర్ పవర్‌ఫుల్ కెమేరాలతో 50 మీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో భూమిపై జరిగే మార్పుల్ని ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాల్ని తీసి పంపుతుంది. 


అయితే తొలి రెండు దశలు సవ్యంగానే జరిగినా మూడవ దశలో సాంకేతిక లోపంతో క్రయోజనిక్ బూస్టర్ల ప్రజ్వలన జరగలేదు. దాంతో ప్రయోగం కాస్తా విఫలమైంది. బుధవారం ఉదంయ 3 గంటల 43 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమై..ఇవాళ ఉదయం 5 గంటల 43 నిమిషాలకు రాకెట్‌ను ప్రయోగించారు. తిరిగి ఎప్పుడు ప్రయోగించేది ఇస్రో(ISRO) ఇంకా వెల్లడించలేదు. సాంకేతిక సమస్యకు కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నంలో శాస్త్రవేత్తలున్నారు. 


Also read: JEE Main 2021 Exam: జెఇఇ మెయిన్ 2021 పరీక్ష దరఖాస్తుకు నేటితో ముగియనున్న గడువు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook