Chandrayaan 3: ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతానికి మరి కొద్దిగంటలే మిగిలింది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపే అద్భుత దృశ్యం దేశం మొత్తం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. చివరి నిమిషంలో ఇస్రో ల్యాంగింగ్ సమయాన్ని కొద్దిగా మార్చింది. ఎందుకంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రయాన్ 3 విజయవంతంగా దూసుకుపోతోంది. జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 లక్ష్యానికి అత్యంత చేరువలో ఉంది. చంద్రుని కక్ష్యలో కేవలం 25 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23 సాయంత్రం అంటే ఎల్లుండి సాయంత్రం చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండ్ కానుంది. ల్యాండర్ చంద్రునిపై దిగే కార్యక్రమాన్ని ప్రజలంతా చూసేలా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్, ఫేస్‌బుక్ పేజ్, డీడీ నేషనల్ సహా ఇతర ఛానెళ్లలో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. 


మరోవైపు రష్యా ప్రయోగించిన లూనా 25 మిషన్ చంద్రయాన్ 2 తరహాలో చివరి నిమిషంలో నిన్న క్రాష్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆందోళన అధికమైంది. ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తున్న చంద్రయాన్ 3 విఫలం కాకూడదని కంకణం కట్టుకున్నారు. బహుశా అందుకే ల్యాండింగ్ ప్రక్రియను మరింత మృదువుగా మార్చేందుకు సమయంలో స్వల్ప మార్పులు చేసింది. ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5.47 గంటలకు ల్యాండ్ కావల్సిన విక్రమ్ ల్యాండర్‌ను మరో 17 నిమిషాలు ఆలస్యం చేశారు. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు ల్యాండ్ చేయాలని నిర్ణయించారు.


Also read: Vande Bharat Express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో చేసిన కొత్త మార్పులు ఇవే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook