Gaganyaan TV-D1 Success: ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన దశ టీవీ-డీ1 ప్రయోగం ఉదయం వాయిదా పడినా అనంతరం రెండు గంటల వ్యవధిలోనే సాదించేశారు. అద్భుతమైన విజయం సాధించి అంతరిక్ష ప్రయోగంలో మరో అడుగు ముందుకేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2025లో చేపట్టనున్న గగన్‌యాన్ పరీక్షలో ఇవాళ జరగాల్సిన టీవీ-డీ1 ప్రయోగం అత్యంత కీలకం. క్రూ ఎస్కేప్ సిస్టమ్ సమర్ధత, క్రూ మాడ్యూల్ పనితీరు, వ్యోమనౌకను తిరిగి క్షేమంగా కిందకు దించే వ్యవస్థ పటిష్టతను ఈ ప్రయోగం ద్వారా పరిశీలించనున్నారు. దీనినే టీవీ-డీ1గా పిలుస్తారు. ఈ ప్రయోగం ప్రకారం భూమికి 17 కిలోమీటర్ల ఎత్తులో టీవీ-డీ1 తీసుకెళ్లి క్రూ మాడ్యూల్ మళ్లీ కిందకు తీసుకొస్తుంది. ఇదొక టెస్టింగ్ ప్రక్రియ. అయితే సరిగ్గా కౌంట్‌డౌన్‌కు 5 సెకన్ల ముందు సాంకేతిక సమస్య కారణంగా లాంచింగ్ వాయిదా వేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది. తిరిగి ఎప్పుడు ప్రయోగించేది చెప్పలేదు. అయితే ఇస్రో నిరవధికంగా ప్రయత్నించి సాంకేతిక సమస్యను గుర్తించి సరిచేయగలిగారు. 


ముందుగా అనుకున్నట్టు 8 గంటలకు కాకుండా 10 గంటలకు తిరిగి ఈ ప్రయోగం చేపట్టి విజయవంతం చేశారు. 44 టన్నుల బరువైన ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్ భూమి నుంచి 17 కిలోమీటర్ల ఎత్తులో విడిచిపెట్టడం, పారాచ్యూట్ సహాయంతో 8 కిలోమీటర్ల దూరంలోని బంగాళాఖాతంలో దిగిన క్రూ మాడ్యూల్‌ని నౌకా దళ సిబ్బంది క్షేమంగా తీసుకురావడం అంతా 8-10 నిమిషాల్లో ముగిసిపోయింది. 


గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన ఈ సన్నాహక ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. 2025లో తుది ప్రయోగానికి ముందు ఇలాంటి ప్రయోగాలు 4 జరగాల్సి ఉంది. ఇది మొదటి ప్రయోగం. క్రూ ఎస్క్పే సిస్టమ్ సమర్ధత, పనితీరుని ఎప్పటికప్పుడు నాలుగు దశల్లో పరీక్షించాల్సి ఉంటుంది. 


Also read: Gaganyaan TV-D1: కీలకమైన గగన్‌యాన్ టీవీ-డీ1 ప్రయోగం వాయిదా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook